పార్టీ అనంతరం జరిగిన ఘటనపై ఆఫీస్‌లో మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. కానీ మేనేజర్ సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ అమ్మాయి కంపెనీ నుంచి వెళ్లిపోయింది. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేడు పబ్బులు, పార్టీలు అనేది సాధారణ పదంగా మారింది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసుకునే విందును కూడా పార్టీ అంటారు. ఇక చాలా మంది ఫ్రెండ్స్, కోలీగ్స్ కలిసి చేసుకునే పార్టీల్లో మద్యం అనేది స్టేటస్ సింబల్‌గా మారింది. ఇక తాగుబోతు స్నేహితులంతా మద్యం సేవించి పార్టీని ఎంజాయ్ చేస్తారు. ఈ ఆధునిక కాలంలో కొన్ని ఆఫీసులు, కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పార్టీలను నిర్వహిస్తాయి. మహిళా ఉద్యోగులు కూడా ఇలాంటి పార్టీల్లో పాల్గొంటారు. అటువంటి పార్టీలలో ఆల్కహాల్‌తో పాటు అన్ని రకాల ఫుడ్‌ఐటమ్స్, స్పెషల్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇకపోతే, ఇప్పుడు మహిళలు కూడా మేం ఎందులోనూ తక్కువ కాదు అన్నట్టుగా మందుకు అలవాటు పడ్డారు. అయితే ఓ కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలో వేసిన గేమ్ ప్లాన్ చూసి ఓ మహిళా ఉద్యోగిని షాక్కు గురైంది. అక్కడ జరిగిన మోసానికి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. చైనాలో జరిగిన ఓ యువతికి ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసేలా వివరించింది.
నేడు మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. అయినప్పటికీ అనేక సందర్బాల్లో మహిళలు ఏదో తెలియని ప్రదేశంలో లేదా వారి సొంత వ్యక్తుల మధ్యనే ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. ఆఫీస్ పార్టీలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మహిళలు సోషల్ మీడియాలో రాసుకున్న అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగులను ‘టీమ్ బిల్డింగ్ ఈవెంట్’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత అక్కడ తమకు ఎదురైన అనుభవాలపై మహిళలు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం మొదలైంది.
ఈ కంపెనీలో ఒక అమ్మాయి ఇంటర్న్‌గా పనిచేసేది. టీమ్ బిల్డింగ్ ఈవెంట్‌కి తనను కూడా ఆహ్వానించారు. ఆ ఈవెంట్‌కి వెళ్లకపోతే ఏమవుతుందోనని, ఈవెంట్‌కు ఎందుకు రాలేదని కంపెనీ అడిగితే తను అందరి దృష్టిలో పడాల్సి వస్తుందని ఆ అమ్మాయి భయపడింది. అందుకే తను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటనతో ఆ యువతి షాక్‌కు గురైంది. టీమ్ బిల్డింగ్ ఈవెంట్ పేరుతో అక్కడ కొన్ని రకాల గేమ్ ఛాలెంజ్‌లు పెట్టారు. అందులో భాగంగా మూడు గ్లాసుల మద్యం తాగాలని, లేదంటే, ఆమె తండ్రి వయసున్న వ్యక్తికి ముద్దియ్యాల్సి ఉంటుందని కండీషన్ పెట్టారు.. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ యువతి.. ఈ గేమ్ ఆడేందుకు నిరాకరించడంతో ఆ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరికి ఆ అమ్మాయి ఏడుస్తూ మూడు గ్లాసుల వైన్ తాగింది
పార్టీ అనంతరం జరిగిన ఘటనపై ఆఫీస్‌లో మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. కానీ మేనేజర్ సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ అమ్మాయి కంపెనీ నుంచి వెళ్లిపోయింది. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం