December 3, 2024
SGSTV NEWS
TrendingViral

Watch Video: గర్ల్‌ ఫ్రెండ్‌ను కలిసేందుకు బురఖా ధరించి ఊపుకుంటూ వెళ్లాడు.. దొంగ అనుకుని చితకొట్టేశారు..! వీడియో

ప్రియురాలిని కలిసేందుకు ఓ యువకుడు పడరాని పాట్లు పడ్డాడు. బురఖా ధరించి, పిల్లిలా ప్రియురాలి ఇంట్లో దూరేందుకు యత్నించాడు. ఇంతలో స్థానికులు దొరకబుచ్చుకుని, అతగాడిని చితక్కొట్టారు. అనంతరం పోలీసులను పిలిచి వారికి అప్పగించారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో..


లక్నో, సెప్టెంబర్‌ 3: ప్రియురాలిని కలిసేందుకు ఓ యువకుడు పడరాని పాట్లు పడ్డాడు. బురఖా ధరించి, పిల్లిలా ప్రియురాలి ఇంట్లో దూరేందుకు యత్నించాడు. ఇంతలో స్థానికులు దొరకబుచ్చుకుని, అతగాడిని చితక్కొట్టారు. అనంతరం పోలీసులను పిలిచి వారికి అప్పగించారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..


ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు పట్టపగలు బురఖా ధరించి, ప్రియురాలు ఉంటున్న ప్రాంతానికి వెళ్లాడు. అతగాడి నడక, వాలకం తేడాగా ఉండటంతో మొదట స్థానికులు దొంగగా భావించారు. అనంతరం పిల్లల కిడ్నాపర్‌గా భావించి అప్రమత్తమయ్యారు. దీంతో అందరూ కూడబలుక్కుని ఒక్కసారిగా యువకుడిపై దాడి చేశారు. అనంతరం అతడిని దొరకబుచ్చుకుని బురఖా తీసివేసి.. చితక్కొట్టారు. బురఖా వెనుక మహిళ అనుకున్నారంతా. అయితే యువకుడు బయటికి రావడంతో అంతా అవాక్కయ్యారు. వెంటనే యువకుడిని తన ఆధార్ కార్డు చూపించమని అడిగారు. ఆధార్‌ కార్డు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేంత వరకు బంధించి.. కొడుతూనే ఉన్నారు. చివరకు పోలీసులు వచ్చి, జనం చేతుల్లోనుంచి అతడిని రక్షించారు. అతడి వద్ద పిస్టల్‌ కూడా ఉందని కొందరు ఆరోపించారు.

https://x.com/gharkekalesh/status/1830476657544610291?t=8g_o20n2144UiLlqky99mA&s=19






బాధిత యువకుడిని చాంద్ భురాగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ పోలీసధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం.. ఇలాంటి విషయాల్లో బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుండి.. పుసుక్కున దొరికిపోయి పిచ్చకొట్టుడు కొట్టించుకున్నాడంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via