November 21, 2024
SGSTV NEWS
TrendingViral

హోలీ పేరుతో రెచ్చిపోయి రోడ్లమీదే ఇలా.. నెటిజన్ల ఫైర్‌..వైరల్ వీడియో

హోలీకి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మథుర-బృందావన్‌లో మార్కెట్‌లు అందమైన రంగులతో ముస్తాభయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్పుడే రంగులతో ఆడుకోవడం ప్రారంభించారు. అయితే ఢిల్లీ నుంచి అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులకు కోపం తెప్పించింది. వాస్తవానికి, వసంత్ కుంజ్ ప్రాంతంలో ఇద్దరు యువకులు చేసిన హంగామా అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. వారు కదులుతున్న వాహనం సన్‌రూఫ్ నుండి వాటర్‌ బెలూన్‌లను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులు, మహిళలపై విసురుతూ కనిపించారు. మరో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఇదంతా వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేసింది. వారిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేసింది. పోలీసులు ఆ పోకిరీలను పట్టుకుని లాఠీలతో హోలీ ఆడాలంటున్నారు నెటిజన్లు.

వీడియో మార్చి 17న @snehasi78473513 హ్యాండిల్‌తో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో పోస్ట్ చేయబడింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్, ఢిల్లీ పోలీస్, ఢిల్లీ పోలీస్ కమీషనర్‌లను ట్యాగ్ చేస్తూ ఇలా రాశారు. మార్చి 16 మధ్యాహ్నం వసంత్ కుంజ్‌లో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు, మహిళలపై ఇద్దరు యువకులు వాటర్ బెలూన్లు విసురుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి పనుల కారణంగా ప్రజలు గాయపడే ప్రమాదం ఉందన్నారు

ఈ విషయం వైరల్ అయినప్పుడు, ఈ క్లిప్ కూడా @gharkekalesh హ్యాండిల్‌తో పోస్ట్ చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోను 8 లక్షలకు పైగా ప్రజలు వీక్షించారు. ఐదు వేలకు పైగా లైక్‌లను పొందింది. అలాగే, వందలాది మంది వినియోగదారులు కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.

Also read

Related posts

Share via