శృంగారం సమయంలో అతడికి ఊపిరి ఆడనివ్వకుండా చేసింది ఆమె. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే మీరూ షాక్ కావడం ఖాయం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ వివరాలు
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో వారం కిందట జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళ.. తన బ్రతుకు బండిని సాగించేందుకు ఇంటింటికి వెళ్లి చీరలను అమ్ముతూ ఉంది. ఈ సమయంలోనే ఆమెకు ఇక్బాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట ఫోన్‌లలో మాట్లాడుకునే వీళ్లిద్దరూ.. ఆ తర్వాత వివాహేతర బంధం పెట్టుకునే స్థాయికి వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆమెకు మొదట ఈ బంధాన్ని ఇష్టంతోనే ఏర్పరుచుకుంది. అయితే ఆ తర్వాత దీనికి ముగింపు చెప్పాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇక్బాల్‌కి చెప్పగా.. అతడు బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తన దగ్గరున్న ఆడియో, వీడియో రికార్డింగ్‌లను బయటపెట్టేస్తానంటూ బెదిరించాడు. ఈ బెదిరింపులకు తలొగ్గిన ఆమె.. భయపడుతూనే తన వివాహేతర బంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే ఓ రోజు ఇక్బాల్ తన భార్యను పుట్టింటికి పంపి.. ఈమెను ఇంటికి రమ్మని పిలిచాడు. దీంతో ఆమె తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి.. ఇక్బాల్ ఇంటికి బయల్దేరింది. వెళ్తూ.. వెళ్తూనే.. ఇక్బాల్‌ను మట్టుపెట్టేందుకు స్కెచ్ సిద్దం చేసింది.
సరైన సమయం కోసం ఎదురుచూసిన ఆమె.. శృంగారం చేస్తుండగా.. అతడి చేతులను ముందుకు రానివ్వకుండా చేసి.. ఛాతిపై కూర్చుని ఎడమ చేతితో ముక్కు, నోరు మూసేసింది. కుడిచేతితో గొంతు పిసికేసింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకుని.. మృతదేహాన్ని ఇంటి మెట్లపై పడేసి చడీచప్పుడు కాకుండా వెళ్లిపోయింది. కాగా, ఇక్బాల్ మృతదేహాన్ని చూసి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించి.. కేసు నమోదు చేశారు. ఇక సదరు మహిళపై అనుమానంతో ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించగా.. ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు