పాములను రెస్క్యూ చేయడం ఒక ఆర్ట్. అగ్రెసీవ్‌గా ఉండే త్రాచుపాము లాంటి వాటిని ఎలా డీల్ చేయాలో తెలిసి ఉండాలి. లేదంటే కాటు పడుద్ది.. ప్రాణం ప్రమాదంలో పడుద్ది. సరదా కోసం, సెల్పీల కోసం పాములతో ఎక్స్ ట్రాలు చేస్తే.. ఫోటోలకు దండ పడటం ఖాయం. బాగా అలవాటు పడిన వారు, పాములు పట్టడంలో ఆరితేరిన పాము.. ఎంత పెద్ద, ప్రమాదకర పామునైనా అలవోకగా పట్టేస్తారు. తాజాగా ఓ వ్యక్తి సెకన్ల వ్యవధిలో పడగ విప్పిన.. నల్లత్రాచును ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. అది రెండు, మూడు సార్లు కాటు వేసేందుకు యత్నించినా వెనక్కి తగ్గలేదు. ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అనే పేజీ ద్వారా X లో పోస్ట్ చేయబడిన చిన్న క్లిప్, ఇప్పటివరకు దాదాపు 3 మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ముందు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
వీడియోను గమనిస్తే.. స్నేక్ క్యాచర్ పామును పట్టేందుకు ఓ ప్లాస్టిక్ డబ్బాతో సిద్ధంగా ఉన్నాడు. నేను చిక్కను అన్నట్లుగా నల్లత్రాచు కూడా పడగవిప్పి తనను తాను రక్షించుకునేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలో పట్టుకునేందుకు ప్రయత్నించగా 2 సార్లు కాటు వేయడానికి ముందుకు దూకింది. ఆ తర్వాత డబ్బాలోకి వెళ్లి మరీ ఒకసారి తప్పించుకుంది. రెండోసారి ఈజీగానే ఆయన దాన్ని బంధించారు. ఈ వీడియోపై నెటిజన్లపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఎన్ని పాములు పట్టిన ఎక్స్‌పీరియన్స్ సార్ మీది.. ఇంత ‘ప్రొ’లా ఉన్నారు అని ఓ యూజర్ పేర్కొన్నాడు. మీరు స్నేక్ మ్యాన్ అని మరొకరు కామెంట్స్ పెట్టారు.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్‌లోనే రేప్!
- Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.