బస్సులో ప్రయణిస్తున్న ఓ వ్యక్తి పాన్ ఉమ్మేందుకు డోర్ తెరిచాడు. అదుపుతప్పిన అతడు కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు లక్నోలోని చిన్‌హట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రామ్ జివాన్‌గా గుర్తించారు.
పాన్ అలవాటు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి పాన్ ఉమ్మేందుకు డోర్ తెరిచాడు. అదుపుతప్పిన అతడు కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్ ఆర్టీసీకి చెందిన ఏసీ బస్సు అజంగఢ్ నుంచి లక్నో వెళ్తుండగా, ఆ బస్సులో ప్రయాణిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి, పాన్ ఉమ్మేందుకు బస్సు డోర్ తెరిచాడు. బస్సు స్పీడ్‌గా ఉండటంతో అతడు బ్యాలెన్స్ ఔట్ అయ్యాడు. దాంతో అతడు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేలో వేగంగా వెళ్తున్న ఆ బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
కాగా, లక్నోలోని చిన్‌హట్ ప్రాంతానికి చెందిన రామ్ జివాన్‌గా మృతుడ్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





