విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది, ఖాతాదారులు కలవరపడ్డారు. సకాలంలో పాము పట్టుకునే కిరణ్ అనే వ్యక్తి బ్యాంకులోని రికార్డు రూమ్ లో ఉన్న పాముతో బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది.
ప్రజంట్ రెయినీ సీజన్ కావడంతో.. జనావాసాల్లోకి పాములు తెగ వస్తున్నాయి. అప్రమత్తత లేకపోతే.. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా విశాఖపట్నంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయంలోకి ఓ పాము ప్రవేశించడంతో కలకలం రేగింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీసు రికార్డు రూములోకి దూరి.. ఓ నాగ జెర్రి తిష్ట వేసింది. ఇక ఉదయమే బ్యాంకు తెరిచిన స్టాఫ్.. రికార్డు రూమ్‌లోకి వెళ్లిన వింత శబ్దాలు రావడంతో.. ఆందోళన చెందారు. ఆ రూమ్ అంతా వెతగ్గా.. పాము కనిపించడంతో పరుగులు తీశారు. అలాగే బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు కూడా పామును చూసి పరుగు లఖించుకున్నారు.
బ్యాంకు సిబ్బంది వెంటనే పట్టే స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు స్నేక్ క్యాచర్.. చాకచక్యంగా ఆ పామును బంధించాడు. అతను చేతులతో ఆ పామును పట్టుకుని.. కార్యాలయం అంతా తిరగడంతో బ్యాంకు సిబ్బంది ఆశ్చర్యపోయారు. కాగా ఆ పామును నాగజెర్రి లేదా జెర్రిగొడ్డు అంటారని.. పెద్దగా విషపూరితం కాదని స్నేక్ క్యాచర్ వెల్లడించాడు. అనంతరం సమీపంలోని ఫారెస్ట్ ఏరియాలో ఆ పామును వదిలి పెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేయగానే.. వెంటనే రెస్పాండ్ అయి స్పందించి… బ్యాంకుకు వచ్చిన స్నేక్ క్యాచర్ కిరణ్‌ను బ్యాంకు సిబ్బంది థ్యాంక్స్ చెప్పారు.
స్నేక్ క్యాచర్ అలవోకగా.. పామును పట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. అతను ఆ పామును చాలా ఈజీగా హ్యండిల్ చేశాడని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వీడియో దిగువన చూడండి…
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే