ఇంతలో ఒక నక్క వేగంగా వారి వద్దకు వచ్చింది. తొలుత ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపర్చింది. స్పందించిన మరో వ్యక్తి ఆ నక్కను బెదరగొట్టేందుకు రాళ్లు విసిరాడు. అది అతడి మీదకు దూసుకొచ్చింది. అయితే దాడి చేసిన నక్కను ఆ వ్యక్తి సుమారు 15 అడుగుల దూరంలోకి విసిరేశాడు. దీంతో అది అక్కడి నుంచి పారిపోయింది.
యూపీ ప్రజల్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎట్నుంచి దాడి చేస్తాయో తెలియక అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కంటి మీద నిద్రలేకుండా గ్రామస్తులు గస్తీ కాస్తున్నారు. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లో నక్కల బెడద పట్టుకుంది. సోమవారం రాత్రి, ఎంపీలోని సెహోర్ జిల్లాలో ఒక నక్క ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. రెహ్తీ తహసీల్‌లోని సగోనియా పంచాయతీలో రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తులపై నక్క దాడి చేసింది. ఈ భయానక ఘటన సీసీటీవీలో రికార్డయింది. అయితే దాని బారి నుంచి తప్పించుకునేందుకు వారిద్దరూ చాలా పోరాడారు. ఒక వ్యక్తి ఆ నక్కను ఎత్తి దూరంగా విసిరేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 9న సాయంత్రం సగోనియా గ్రామంలో రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక నక్క వేగంగా వారి వద్దకు వచ్చింది. తొలుత ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపర్చింది. స్పందించిన మరో వ్యక్తి ఆ నక్కను బెదరగొట్టేందుకు రాళ్లు విసిరాడు. అది అతడి మీదకు దూసుకొచ్చింది. అయితే దాడి చేసిన నక్కను ఆ వ్యక్తి సుమారు 15 అడుగుల దూరంలోకి విసిరేశాడు. దీంతో అది అక్కడి నుంచి పారిపోయింది.
కాగా, నక్క దాడిలో గాయపడిన వ్యక్తులను శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్‌గా గుర్తించారు. వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నక్క దాడిపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025