April 11, 2025
SGSTV NEWS
CrimeNational

పోలీస్‌ డాగ్‌ సాహసం.. వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి మహిళ ప్రాణాలు కాపాడింది..

పెద్దగా అరుపులు వినిపించిన ఒక ఇంటి వద్ద ఆగింది ఆ పోలీస్‌ డాగ్‌. అక్కడ గట్టిగా మొరగడంతో పోలీస్‌ డాగ్‌ను వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలుకొట్టారు. ఒక మహిళను కొట్టి చంపుతున్న హంతకుడ్ని పట్టుకున్నారు. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఆ మహిళను రక్షించారు. మరోవైపు హత్యకు గురైన వ్యక్తిని

Also read :జాతకంలో చంద్ర దోషమా..! గురు పౌర్ణమి రోజున ఈ వ్రత కథ వినండి.. ఉపశమనం లభిస్తుంది

ఓ పోలీస్‌ జాగిలం చేసిన పనికి ప్రజలంతా దానిని ప్రశంసిస్తున్నారు. పోలీస్‌డాగ్ సాహాసానికి ప్రజలు సెల్యూట్‌ చేస్తున్నారు. జోరు వర్షంలో 8 కిలోమీటర్లు పరిగెత్తిన జాగిలం హంతకుడి బారినుంచి మహిళ ప్రాణాలను కాపాడింది. హత్యకు గురైన వ్యక్తి మృతదేహం వద్ద వాసన చూసిన పోలీస్‌ డాగ్‌ అతడు మరో హత్య చేయకుండా అడ్డుకోగలిగింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also read :దేశానికి రాజైనా ఒక గురువుకి శిష్యుడే.. మన పురాణాల్లో ఉత్తమ గురు-శిష్యులు..

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో గురువారం రాత్రి 9.45 గంటల సమయంలో సంతబెన్నూరులోని పెట్రోలు బంక్‌ సమీపంలో హత్యకు గురైన ఒక వ్యక్తి మృతదేహాన్ని గస్తీ పోలీసులు గమనించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా, ఎస్పీ ఉమా ప్రశాంత్ వెంటనే స్పందించారు. పోలీస్‌ డాగ్‌ తుంగ 2, దాని హ్యాండ్లర్‌ అయిన కానిస్టేబుల్ షఫీ, ఇతర పోలీస్‌ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు

Also read :Fish on Road: రోడ్డుపై చేపల పరుగులు.. ఎగబడిన జనం.. ఎక్కడో తెలుసా..?

డాబర్‌మ్యాన్ డాగ్‌ ఆ మృతదేహం వద్ద వాసన చూసింది. హంతకుడ్ని పసిగట్టేందుకు అక్కడి నుంచి పరుగులు తీసింది. పై నుంచి జోరు వర్షం కురుస్తుండగా, వానలో 8 కిలోమీటర్ల దూరం పరుగెత్తింది. చన్నాపురా గ్రామానికి చేరింది. పెద్దగా అరుపులు వినిపించిన ఒక ఇంటి వద్ద ఆగింది ఆ పోలీస్‌ డాగ్‌. అక్కడ గట్టిగా మొరగడంతో పోలీస్‌ డాగ్‌ను వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలుకొట్టారు. ఒక మహిళను కొట్టి చంపుతున్న హంతకుడ్ని పట్టుకున్నారు. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఆ మహిళను రక్షించారు. మరోవైపు హత్యకు గురైన వ్యక్తిని 33 ఏళ్ల సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.

Also read :Andhra Pradesh: వామ్మో.. వీడు పోలీసులను చూస్తే సైకోలా మారతాడట.. పాపం ఆ హెడ్ కానిస్టేబుల్

Related posts

Share via