November 21, 2024
SGSTV NEWS
TrendingViral

కుక్క తో కోడి పుంజు బాక్సింగ్.. అబ్బుర పరిచే కుక్క, కోడి స్నేహం..

నెట్టింట అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. మ‌నం అనుకుంటాం గానీ జంతువుల‌కు కూడా మ‌నుషుల్లాగే ఎమోష‌న్స్ ఉంటాయండోయ్‌..! అవి కూడా కోపాన్ని, జాలిని, ప్రేమ‌ను చూపిస్తుంటాయి. ఫ్రెండ్ షిప్ కోసం ఇత‌ర జంతువుల‌తో పోట్లాడిన వీడియోలను అప్పడప్పుడు మ‌నం నెట్టింట్లో అనేకం చూస్తున్నాం.



నెట్టింట అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. మ‌నం అనుకుంటాం గానీ జంతువుల‌కు కూడా మ‌నుషుల్లాగే ఎమోష‌న్స్ ఉంటాయండోయ్‌..! అవి కూడా కోపాన్ని, జాలిని, ప్రేమ‌ను చూపిస్తుంటాయి. ఫ్రెండ్ షిప్ కోసం ఇత‌ర జంతువుల‌తో పోట్లాడిన వీడియోలను అప్పడప్పుడు మ‌నం నెట్టింట్లో అనేకం చూస్తున్నాం. అలాగే కోడి పందాలు చూసి ఉంటాం. కుక్కలు ఫైటింగ్ చూసి ఉంటాం. కానీ ఒక కుక్కతో ఒక కోడి పుంజు ఫైటింగ్ ఎక్కడైనా చూసారా..? అది చూడాలంటే ..ఈ న్యూస్ చదవాల్సిందే మరి..!

కుక్క ముందు పోజులు ఇస్తూ…కుక్క మీదకే కాలు దువ్వుతుంది ఒక కోడి పుంజు. కోడి పుంజు యాక్షన్‌ను చూస్తూ.. సరదాగా ఎక్సర్ సైజ్ చేస్తుంది ఒక కుక్క. ఇదంతా ఖమ్మం జిల్లా కల్లూరు లోని NSP క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకున్న సంఘటన ఇది.

కల్లూరులోని ఒక ఇంటి యజమాని తన ఇంట్లో కోడి పుంజు పెంచుకుంటున్నాడు. అదే సమయంలో ఒక కుక్క పిల్ల ఇంటికి వస్తే అన్నం పెడుతూ చేరదీశాడు. ఆ కుక్కను కూడా పెంపుడు కుక్కగా సాకుతున్నారు. కుక్కకు ముద్దుగా రాజు అని పేరు పెట్టాడు. కోడి పుంజు తెల్లగా ఉందని వైటి అని పేరు పెట్టాడు. ఇవి రెండు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరగడంతో కోడి పుంజు,కుక్క మంచి స్నేహితులు అయ్యాయి.

పగలంతా కోడి పుంజు ను భద్రంగా వేరే జంతువులు దాడి చెయ్యకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది రాజు అనే కుక్క. కోడి పుంజు మాత్రం దర్జాగా రాత్రుళ్ళు నిద్రపోయి…తెల్లవారు జామునే కుక్క వద్దకు వచ్చి లేపుతుంది. ఎప్పుడు కుక్కతోనే తిరుగుతూ కుక్క మీదకే ఫైటింగ్ కు దిగుతుంది ఆ కోడి పుంజు.

ఇదిగో వీడియో చూసేయండి..





ఆ ప్రాంతంలో వైటీ పేరుతో కోడి పుంజు, రాజు పేరుతో కుక్క తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇవి రెండు పగటి పూట అటు.. ఇటు..తిరుగుతూ చుట్టుపక్కల ఇండ్ల చుట్టూ సరదా చేస్తూ తిరుగుతాయని వాటి యజమాని రేపాకుల మనోజ్ అనే యువకుడు తెలిపాడు. స్నేహితులు మాదిరిగానే కలిసి తిరుగుతాయి. అదేవిధంగా ఫైటింగ్ కూడా చేసుకుంటాయని వాటిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుందని ఆ యువకుడు తెలిపాడు. వీటి సంబరాన్ని చూసి స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also read

Related posts

Share via