ఈతరం యూత్ తమకు నచ్చినట్టుగా బతుకడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్దలు చెప్పినా, కన్నవాళ్లు వద్దని వారించినా డోన్ట్ కేర్ అంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వ్యామోహమో, సినిమాల ప్రభావమో కానీ చిన్న వయసులోనే ప్రేమ పెళ్లిలకు సిద్ధపడుతున్నారు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా ఎదురించి తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాదు.. తల్లిదండ్రులకు శాశ్వాతంగా గుడ్ బై చెప్పి సొంతింటి నుంచి వెళ్లిపోతున్నారు.
కూతురి ప్రేమ పెళ్లి.. ఫ్లెక్సీతో షాక్ ఇచ్చిన తండ్రి
రాజన్న సిరిసిల్ల: ఓ తండ్రి తన కూతురిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె అడిగినది కాదనక పెంచి పెద్ద చేశాడు. అయితే ఇప్పుడు తన తండ్రికి ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుంది.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ తండ్రి..చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమై నెట్టింట వైరల్‌గా మారింది.
ఏం జరిగిందంటే.. ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి తన కూతురికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేసి బంధుమిత్రులందరికీ తన కూతురు చనిపోయిందని పిండ ప్రదానాలు చేశాడు.
ఈ షాకింగ్ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఫోటో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైరల్ గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూష అనే యువతి ఇటివలే ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది. ఇలా కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న బాధను జీర్ణించుకోలేక తండ్రి ఈ దురాగతానికి పూనుకున్నాడు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!