April 11, 2025
SGSTV NEWS
NationalTelangana

Watch: బస్సు నడుపుతూ గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కండక్టర్‌ చేసిన పనితో ప్రయాణికులు సేఫ్‌..!



డ్రైవర్‌ను గమనించిన కండక్టర్‌ ఓబలేశ్‌ వెంటనే డ్రైవర్‌ సీటుపైకి ఎక్కి స్టీరింగ్‌ పట్టుకుని బస్సును అదుపు చేశారు. అనంతరం డ్రైవర్‌ను కాపాడేందుకు కండక్టర్‌ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బెంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బస్సు నడుపుతుండగా బీఎంటీసీ డ్రైవర్ కిరణ్ కుమార్ గుండెపోటుకు గురై సీటుపైనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్‌ను గమనించిన కండక్టర్‌ ఓబలేశ్‌ వెంటనే డ్రైవర్‌ సీటుపైకి ఎక్కి స్టీరింగ్‌ పట్టుకుని బస్సును అదుపు చేశారు. అనంతరం డ్రైవర్‌ను కాపాడేందుకు కండక్టర్‌ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


నవంబర్ 6న ఆకస్మిక గుండెపోటుతో మరణించిన డిపో 40కి చెందిన డ్రైవర్ కిరణ్ కుమార్ అకాల మరణం చాలా బాధాకరం అంటూ.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. “ఆయన ఆత్మకు శాంతి కలగాలని కార్పొరేషన్ ప్రార్థించింది. BMTC నుండి సీనియర్ అధికారులు కుటుంబాన్ని పరామర్శించారు. వారి సానుభూతి తెలియజేసారు. అంతిమ సంస్కారాలకు సహాయం చేయడానికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపును అందించారు” అని BMTC ఒక ప్రకటనలో తెలిపింది.

Also read





Related posts

Share via