November 21, 2024
SGSTV NEWS
NationalTrending

శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి.. బృందావన్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన వరుడు..

ఏప్రిల్18న కృష్ణుడితో శివాని వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. శివానీ పెళ్లి కార్యక్రమాలు ఏప్రిల్ 15 న మొదలయ్యాయి. తొలిరోజు పసుపు దంచే కార్యక్రమం 16న మంటపం, ఏప్రిల్ 17వ తేదీన కళ్యాణ ఊరేగింపు వచ్చి సనాతన ఆచార వ్యవహారాలతో ఏప్రిల్‌ 18న కల్యాణం జరిగింది. శివానీ తల్లిదండ్రులు సంతోషంగా తమ కూతురికి కన్యాదానం చేసి పంపించారు. ఇలాంటి అరుదైన పెళ్లి వేడుకను చూసేందుకు వందలాది మంది ప్రజలు తరలివచ్చారు.

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఒక అపూర్వ వివాహం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిని చూసేందుకు ప్రజలే కాదు సాధువులు కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గ్వాలియర్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఒక యువతి తను ఎంతగానో ఆరాధించే కన్నయ్యను వరించింది. చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ పెరిగిన ఆమె… చివరకు ఆ కృష్ణుడినే భర్తగా చేసుకోవాలని భావించింది. తల్లిదండ్రులు వద్దని వారించినా ఆమె వినలేదు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎంతమంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారందరినీ తనే మాటలనే అంగీకరించేలా వారిని ఒప్పించింది. చివరకు బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా శ్రీకృష్ణుడ్ని పరిణయం చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నగరం న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీకి చెందిన శివానీ బీకామ్ పూర్తి చేసింది. కానీ, ఆ తర్వాత తన కన్నయ్యను మాత్రమే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది. ఆమె తండ్రి రామ్ ప్రతాప్ పరిహార్, తల్లి మీరా పరిహార్ ఈ వివాహాన్ని వ్యతిరేకించారు., కానీ వారి కుమార్తె మొండితనం కారణంగా ఎట్టకేలకు వారు కూడా దీనికి అంగీకరించవలసి వచ్చింది. ఏప్రిల్18న కృష్ణుడితో శివాని వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. శివానీ పెళ్లి కార్యక్రమాలు ఏప్రిల్ 15 న మొదలయ్యాయి. తొలిరోజు పసుపు దంచే కార్యక్రమం 16న మంటపం, ఏప్రిల్ 17వ తేదీన కళ్యాణ ఊరేగింపు వచ్చి సనాతన ఆచార వ్యవహారాలతో ఏప్రిల్‌ 18న కల్యాణం జరిగింది. శివానీ తల్లిదండ్రులు సంతోషంగా తమ కూతురికి కన్యాదానం చేసి పంపించారు. ఇలాంటి అరుదైన పెళ్లి వేడుకను చూసేందుకు వందలాది మంది ప్రజలు తరలివచ్చారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నగరం న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీకి చెందిన శివాని పరిహార్‌ (23)కు ఏప్రిల్ 18న కృష్ణుడితో పెళ్లి జరిగింది. వేదమంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లితో ఆమె ఆ భగవంతుడ్ని తన భర్తగా చేసుకుంది. అంతేకాదు…కన్నయ్యతో వివాహం ఏదో తూతూ మంత్రంగా జరగలేదు. వరుడు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బృందావన్‌ నుంచి బాజాభజంత్రీలు, మేళతాళలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ మండపంలో శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని కూర్చోబెట్టారు. స్థానిక ఆలయంలో శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. శివాని కన్నయ్యల కల్యాణంలో భాగంగా వారు ఏడుగుల తంతూ కూడా పూర్తి చేశారు. వీరి వివాహ వేడుకను చూసేందుకు తరలివచ్చిన వందలాది మంది మహిళలు మంగళగీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. పెళ్లి క్రతువు ముగిశాక శివానీకి వివాహ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను కూడా అధికారులు అందజేశారు. వివాహనాంతరం శ్రీ కృష్ణుడి విగ్రహంతో వధువు బృందావనానికి బయలుదేరి వెళ్లింది.

Also read

Related posts

Share via