November 21, 2024
SGSTV NEWS
InternationalViral

Viral: జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ వింత వస్తువు.. వెలికితీసి చూడగా స్టన్

ఇప్పుడైతే మన డబ్బును దాచుకునేందుకు అనేక గవర్నమెంట్, ప్రైవేటు బ్యాంకులు ఎన్నో ఉన్నాయి. కానీ పూర్వకాలంలో అలా కాదు.. డబ్బు దాచుకోవాలంటేనే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎక్కువగా బ్యాంకులు ఉండేవి కావు. పైగా దోపిడీ దొంగలు భయం ఒకటి. అందుకే పూర్వీకులు తమ వ్యవసాయ క్షేత్రంలో లేదా ఇంటి ముందు ఉండే ఖాళీ స్థలంలోనైనా చిన్న చిన్న గోతులు తవ్వుకుని.. ఆ మట్టిలో తమ బంగారాన్ని, డబ్బును ఓ సంచిలో పెట్టి దాచుకున్నారు. ఇక ఇప్పుడు ఆనాటి పురాతన నాణేలు, ఆభరణాలు మనకు తవ్వకాల్లో లభిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలానే జరిగాయి. అంతేకాకుండా అవి క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ తరహాలోనే ఓ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకెళ్తే.. జర్మనీకి చెందిన నిర్మాణ కార్మికులు పొలంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో 17వ శతాబ్దపు మేయర్‌కి చెందిన పురాతన నాణేలను కనుగొన్నారు. ఓ మట్టి కుండ సుమారు 285 పురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. ఇవి 1499-1652 మధ్యకాలానికి చెందినవిగా గుర్తించారు. తూర్పు మధ్య జర్మనీలోని వెట్టిన్ పట్టణంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో మురుగు కాలువ ఏర్పాటు కోసం తవ్వకాలు జరుపుతుండగా.. ఈ పురాతన నిధి బయటపడింది. బయటపడ్డ మట్టి కుండలో వెండి నాణేలతో పాటు.. వాటిని తయారు చేసే మిశ్రమం కూడా దొరకటం గమనార్హం.

Also read :ఇదేం పని మేడమ్..! గురుకుల హాస్టల్‌లో గుట్టుగా బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్

ఈ నిధిని 1618-1648 మధ్య జరిగిన ముప్పై సంవత్సరాల యుద్ధం ముగిసిన తర్వాత పాతిపెట్టినట్టుగా పురావస్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏళ్ల తరబడి భూగర్భంలో ఉండటం వల్ల వెండి నాణేలకు నాచు అంటుకుంది. నాణేల శ్రేణిని ఆధారంగా చేసుకుని 1660 సంవత్సరం చివరన వెట్టిన్ పట్టణానికి మేయర్‌గా ఉన్న జోహాన్ డోండోర్ఫ్‌కు చెందినవిగా జర్మనీ పురావస్తు శాఖ నిర్ధారించింది. డోండోర్ఫ్ మేయర్‌గా ఉన్న సమయంలో వెట్టిన్ అత్యంత సంపన్నమైన పట్టణంగా ఉండేది. 1675లో అతడి మరణం తర్వాత కోర్టు.. డోండోర్ఫ్ ఆస్తిని అంచనా వేసింది. 2,500 కంటే ఎక్కువ థాలర్లు, 500 డకట్‌లు(బంగారు నాణేలు) అతడు తన ఇంటి అంతటా సీక్రెట్ గదులలో దాచి ఉంచాడు. అయితే ఇప్పుడు బయటపడ్డ నిధిని చూస్తే.. కోర్టు ఆ సమయంలో అంచనా వేసిన అతడి ఆస్తి లెక్క తప్పు అని స్పష్టమవుతోంది

Also read :DSPతో సహా 50 మందితో వివాహం! ఫస్ట్ నైట్ అవ్వగానే భర్తని మార్చేస్తూ!

Gupta Navratri: గుప్త నవరాత్రి పూజ శుభ సమయం, కలశాన్ని ఏర్పాటు చేయడానికి నియమాలు ఏమిటంటే

Well: మాయదారి నీళ్ల బావి.. ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురిని వరుసగా మింగేసింది!

Related posts

Share via