February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

కౌగిలించుకొని కత్తితో పొడిచి..యువకుడిపై ట్రాన్స్ జెండర్ హత్యాయత్నం


ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఒక యువకుడిపై ట్రాన్స్‌ జెండర్‌ కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం కారణం గానే నిందితుడు హత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.



Transgender Attack :  ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఒక యువకుడిపై ట్రాన్స్‌ జెండర్‌ కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం కారణం గానే నిందితుడు హత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా బాధితుడు మోహన్ కృష్ణ నాగేందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు ఏపీలోని కృష్ణాజిల్లా బంటుపల్లికి చెందిన సొగని వీరబాబు అలియాస్ సాన్విగా గుర్తించారు.

కాగా  మోహన్ కృష్ణ నాగేందర్, వీరబాబుకు ఇన్‌స్ట్రాగ్రాం ద్వారా పరిచయమైనట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ గత కొద్దికాలంగా వీరబాబును మోహన్‌ కృష్ణ దూరం పెడుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు కాల్‌ చేసిన మోహన్ కృష్ణ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఖమ్మం వచ్చి మోహన్ కృష్ణ నాగేంద్రను  వీరబాబు నిలదీశాడు. తనను ప్రేమించానని నమ్మించి మోసం చేస్తావా అంటూ మోహన్ కృష్ణతో వీరబాబు అలియాస్ సాన్వి వాగ్వాదానికి దిగాడు. కలిసే ఉందామంటూ మోహన్ కృష్ణ నాగేంద్రపై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ నాగేంద్ర ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసినట్లు స్థానికులు చెబుతున్నారు.

తన ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో ఆవేశంతో మోహన్ కృష్ణను కౌగిలించుకుని వెంట తెచ్చుకున్న కత్తితో వీరబాబు అలియాస్ సాన్వీ నాలుగుసార్లు వీపులో పొడిచినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా విషయాన్ని గమనించిన మోహన్ కృష్ణ నాగేంద్రను స్నేహితులు ఆయనను హుటాహుటిన ఖమ్మంలోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వీరబాబు అలియాస్ సాన్వీని అదుపులోకి తీసుకున్న ఖమ్మం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via