SGSTV NEWS
CrimeTelangana

TG News: యువకుడి ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్..

భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్న వంశీ అక్కడే సామ్రాట్ లాడ్జిని ఆనుకొని ఉన్న ఓ గదిలో నివాసముంటున్నాడు. అయితే ఈరోజు ఉదయం వంశీ బ్రష్ చేసుకుంటుండగా లాడ్జీ ట్రాన్స్ఫార్మర్ తీగల ద్వారా విద్యుత్ ఘాతం ఏర్పడి అక్కడిక్కడే మృతి చెందాడు.

TG News:  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా జగన్నాథపురం గ్రామానికి చెందిన సోమిడి వంశీ అనే యువకుడు.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్ పని చేస్తూ.. అదే పట్టణంలో నివాసం ఉంటున్నాడు.  భద్రాచలంలో వంశీ నివాసం ఉంటున్న గది సామ్రాట్ లాడ్జీని ఆనుకొని ఉంటుంది. అయితే ఈరోజు అదే వంశీ ప్రాణాలు పోవడానికి కారణం అవుతుందని ఎవరూ ఊహించలేదు!

ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్
రోజు మాదిరిగానే వంశీ ఈరోజు ఉదయం కూడా గది బయటకు వచ్చి బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న  ట్రాన్స్ఫార్మర్  నుంచి తీగల ద్వారా విద్యుత్ ఘాతం ఏర్పడి  అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే సామ్రాట్ లాడ్జ్ కి సంబంధించిన విద్యుత్ తీగల గదికి ఆనుకొని ఉండడం వల్లే ఈ ఘటన జరిగినట్లు వంశీ స్నేహితులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వంశీ మృతికి విద్యుత్ శాఖ అధికారులు, సామ్రాట్ లాడ్జి నిర్వాహకులే కారణమని మండిపడుతున్నారు. ఫుట్ పాత్ ను ఆక్రమించి గృహనివాసాలకు ఆనుకుని ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

షాక్ తగిలిన తర్వాత వంశీ ఐదు నిమిషాల పాటు విద్యుత్ తీగలకు అతుక్కుపోయి ఉన్నాడు. శరీరంలోకి భారీగా విద్యుత్ ప్రసరణ జరగడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share this