December 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

Crime News: స్నానాల గదిలో.. తల్లి, తండ్రి, కుమారుడి మృతి

హైదరాబాద్ సనత్నగర్లో లోని జెక్కాలనీలో అనుమానాస్పద స్థితిలో దంపతులు, వారి కుమారుడు మృతి చెందారు.

సనత్ నగర్, : హైదరాబాద్ సనత్ నగర్ లోని జెక్కాలనీలో అనుమానాస్పద స్థితిలో దంపతులు, వారి కుమారుడు మృతి చెందారు. అపార్ట్మెంట్ వాసులు, పోలీసుల కథనం ప్రకారం.. సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకింగ్ సొల్యూషన్స్ సంస్థలో ఆర్.వెంకటేష్ (59) బిజినెస్ యూనిట్ హెడ్గా పనిచేస్తున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు 2014లో జెక్కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్లోకి అద్దెకు వచ్చారు. ప్లాట్లో వెంకటేష్, భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) ఉంటున్నారు. మానసిక స్థితి సరిగాలేని కుమారుడు హరికృష్ణ బాగోగులను తల్లిదండ్రులే చూస్తుంటారు. పనిమనిషి వరలక్ష్మి ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ప్లాట్లోకి వచ్చింది. తలుపులు తీసే ఉండటంతో వంటింట్లో పనిచేసి వెళ్లింది. తిరిగి సాయంత్రం 4 గంటల సమయంలో శనివారం మాధవి ఇచ్చిన ప్లేట్లను ఇవ్వడానికి వెళ్లగా అప్పుడూ ఇంట్లో అలికిడి లేదు. మళ్లీ 6.30 గంటలకు విజయలక్ష్మి అనే మహిళతో కలసి వెళ్లి చూసింది. ఇద్దరూ ఇల్లంతా వెతికారు. స్నానాల గది తలుపు దగ్గరగా వేసి ఉన్నా. com తెరవడానికి రాకపోవడంతో వాచ్మ్యాన్ సత్యనారాయణను పిలిచారు. అతడు గట్టిగా ప్రయత్నించడంతో ఇంకొంతతెరుచుకుంది. అక్కడ వెంకటేష్, మాధవి, హరికృష్ణ విగతజీవులై ఉన్నారు. హరికృష్ణ ఒంటిపై దుస్తులు లేవు. హరికృష్ణకు తరచూ తల్లిదండ్రులే స్నానం చేయిస్తుంటారని అపార్ట్మెంట్ వాసులు చెప్పారు.

Also read :పల్నాడు జిల్లా.*కలెక్టర్ సీసీ జానీ బాషా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ ఆరోపణ*..వీడియో

విద్యుదాఘాతమే కారణమా?

భార్య, భర్త, వారి కుమారుడు చనిపోవడానికి విద్యుదాఘాతమే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపార్ట్మెంట్లో తరచూ ఎర్తింగ్ సమస్య వచ్చి విద్యుదాఘాతం జరుగుతుండటంతో తాము ఒకసారి విద్యుత్తు అధికారులకు ఫిర్యాదు చేశామని కాలనీ సమాఖ్య అధ్యక్షుడు, ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ కార్యదర్శి డా.మల్లు ప్రసాద్ చెప్పారు. దీంతో ఇది కూడా విద్యుదాఘాతం కావొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

Also read :AP News: 108 అంబులెన్స్‌‌ను సీజ్ చేసిన పోలీసులు.. రీజన్ ఇదే…

Related posts

Share via