December 12, 2024
SGSTV NEWS
CrimeTelangana

TG Crime: హైదరాబాద్‌లో విషాదం..  నారాయణ కాలేజీలో మరో విద్యార్థి మృతి

హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థి బానోత్‌ తనూష్‌ నాయక్‌(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

TG Crime : పిల్లలకు మంచి చదువులు అందించాలని తల్లిదండ్రులు పెద్దపెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అవ్వాలని ఆశపడుతూ.. వారి భవిష్యత్తును అంధకారం చేయటంతోపాు పిల్లల్ని చేజేతులా కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు భాగ్యనగరంలో ఇప్పటి వరకు ఎన్నో చూసి ఉంటాము. నారాయణ, శ్రీచైతన్య కాలేజీలో చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇలా ఎన్ని ఘటనలు జరిగినా.. తల్లిదండ్రుల్లో మార్పులు రావటం లేదు. అయితే తాజాగా నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ చవుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటంతో  కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌  విద్యార్థి బానోత్‌ తనూష్‌ నాయక్‌(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ రాజు వివరాల ప్రకారం. సోమవారం సాయంత్రం బాత్‌రూంలోకి వెళ్ళి ఎంత సేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి పరిశీలించారు. తనూష్‌ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్ల గుర్తించారు. పోచారం ఐటీ కారిడార్ పీఎస్‌ పరిధిలోని  ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు.అయితే ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమని సమాచారం. బాత్రూంలో ఉరి వేసుకుని తనుష్ బలవన్మరణానికి పాల్పడటంతో గమనించిన విద్యార్థులు వెంటనే యజమాన్యానికి సమాచారం ఇచ్చారు.

ప్రమాదంపై స్పందించిన కాలేజీ సిబ్బంది హుటాహుటిన తనుష్‌ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు తనుష్  అప్పటికే  మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం తనుష్ మృతి చెందినట్లుగా  కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తనుష్‌ మృతికి లెక్చరర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆరోపిస్తు్న్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via