నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కుసుమర్తిలో రైతు తిప్పణ్ణ(50) భీమా నదిలో గల్లంతు అయ్యాడు. పొలానికి నీరు రావడం లేదని గుర్తించి నదిలోకి దిగానే మొసలి ఆకస్మాత్తుగా దాడి చేసి నదిలోకి లాక్కెళ్లింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
TG Crime: నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కుసుమర్తిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తిప్పణ్ణ(50) శనివారం మధ్యాహ్నం భీమా నదిలో గల్లంతైడు. అతను పొలానికి నీరు రావడం లేదని గుర్తించి సమస్యను పరిశీలించేందుకు కృష్ణ ద్వైపాయన మఠం సమీపంలోని నదిలోకి దిగాడు. నదిలో ఏర్పాటు చేసుకున్న పైపులోకి నీరు రావడం లేదని భావించి మడుగులోని మోటారు వాల్వ్‌ను పరిశీలించేందుకు అడుగు పెట్టిన తిప్పణ్ణపై నదిలో ఉన్న మొసలి ఆకస్మాత్తుగా దాడి చేసింది. అతడిని నదిలోకి లాక్కెళ్లింది.
కొనసాగిన గాలింపు..
ఈ సంఘటనను వెంటనే గమనించిన ఆయన సహచరుడు శివప్పగౌడ, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, జాలర్లు కలిసి గాలింపు చర్యలు చేశారు. అయితే అధికారులు స్పందించి కర్ణాటక తీర ప్రాంతాల నుంచి 20 మంది గజ ఈతగాళ్లను ప్రత్యేకంగా రప్పించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగిన గాలింపు చేసినా తిప్పణ్ణ ఆచూకీ లభించలేదు. ఈ సంఘటనపై స్పందించిన కృష్ణా ఎస్‌ఐ ఎస్‌ఎం నవీద్, గాలింపు కొనసాగుతున్నదని. తిప్పణ్ణను వెతికే పనిలో ఏ మాత్రం ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భీమా నది తీరంలో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడి అనంతరం స్థానిక రైతుల్లో భయం నెలకొంది. పొలాలకు చేరడానికి కూడా వారు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికీ తిప్పణ్ణ ఆచూకీ దొరకకపోవడం గమనార్హం. కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనలో మునిగిపోయారు. మానవ సహాయక బృందాలు ఆదివారం ఉదయం మరోసారి గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. తిప్పణ్ణ ఇలా గల్లంతు కావటంతో గ్రామంలో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్‌హౌస్‌లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్