గుడివాడలో చోటుచేసుకుంది. వృద్ధుడు అయిన ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిప్పు మంచానికి అంటుకోవడంతో మంటల్లో చిక్కుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు
ధూమపానం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసిన కొందరు సేవిస్తుంటారు. వీటివల్ల ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే సిగరెట్ అలవాటే ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుడవాడలోని ద్రోణాదుల వారి వీధిలో చల్లా వెంకటేశ్వరరావు(71) అనే వ్యక్తి ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యాడు.
మంచానికి సిగరెట్ నిప్పు అంటుకుని..
వెంకటేశ్వరరావుకి ధూమపానం అలవాటు ఉంది. దీంతో ఇంట్లో సిగరెట్ తాగుతూ పడుకున్నాడు. ఆ సమయంలో తన భార్య టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఆ సిగరెట్ నిప్పు ప్లాస్టిక్ మంచానికి అంటుకోవడంతో అతను మంటల్లో చిక్కుకున్నాడు. తిరిగి వచ్చిన భార్య వెంటనే ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూనే ఆ వృద్ధుడు మృతి చెందాడు. సిగరెట్ తాగడం వల్లే తన భర్త ప్రాణం కోల్పోయాడని భార్య ఏడుస్తోంది.
ఇదిలా ఉండగా.. పండుగ పూట ఏపీలో పెను విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి శివారులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కాలువలో మినీ వ్యాన్ పడిపోవడంతో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓ వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!