మియాపూర్ మెట్రో స్టేషన్ అతివేగంతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. పోలీసులు యూ టర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. పోలీసులు యూ టర్న్ తీసుకుంటుండగా అతి వేగంతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రాజవర్ధన్, వికేందర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కల్లు తాగి అస్వస్థత..
ఇదిలా ఉండగా ఇటీవల కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు
వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించి వాటిని క్లోజ్ చేశారు.
Also Read
- వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
- ఒకే ఊరు.. అంతా తెలిసిన వాళ్లే.. అయినా ఆ ఇద్దరు భయపడ్డారు.. చివరకు..
- Andhra News: దేవుడు పిలుస్తున్నాడు.. అంటూ తోటి రోగులతో చెప్పాడు.. అంతలోనే..
- Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి
- టీచర్ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని… మనస్తాపంతో టీచర్ రాజీనామా