బంజారాహిల్స్: ఓ వివాహితతో సహజీవనం చేస్తూ ఆమెను అడ్డుగా పెట్టుకుని పలువురిని బెదిరించి కేసులు పెట్టించి డబ్బు దండుకునేందుకు యత్నంచడమే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితున్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. ఖమ్మం జిల్లా మధిర మండలం, సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కిరణ్ కుమార్(34)పై పలువురిని బెదిరించిన ఘటనలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లల్లో 8 కేసులు నమోదై ఉన్నాయి.
శ్రీ కృష్ణానగర్లో అద్దెకు ఉంటున్న కిరణ్ కుమార్ సమీపంలో ఒక ఇంట్లో పనిచేస్తున్న ఒక వివాహితతో రెండు సంవత్సరాక్రితం పరిచయం పెంచుకున్నాడు. నిన్ను, నీ పిల్లల బాగోగులు చూసుకుంటానంటూ చెప్పాడు. మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవల పక్కింట్లో నివసిస్తున్న ఓ యువకుడితో ఆమె మాట్లాడుతుండగా చూసిన కిరణ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమెతో ఫిర్యాదు చేయించి తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పించాడు.
సదరు యువకుడిని బ్లాక్మెయిల్ చేశాడు. ఇలాంటి అబద్ధాలు ఎందుకంటూ ఆమె కిరణ్ కుమార్ను నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాద్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న కిరణ్ కుమార్ ఈ నెల 17న తన గదిలో తాళ్లతో ఆమెను మంచానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. కడుపులో తన్నాడు. ఆమె విలవిలాడుతుండగానే అలాగే వదిలేసి పారిపోయాడు. కట్లు విప్పుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండు తరలించారు. నిందితుడు గతంలో కూడా జైలుకు వెళ్లొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025