ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు సొంత బిడ్డనే కిడ్నాప్ చేయించింది ఓ మహిళ. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. కొడుకుని కిడ్నాప్ చేయించి కిడ్నాపర్లమని చెప్పించి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది మహిళ. పోలీసులు అనుమానంతో విచారించగా నిజాన్ని ఒప్పుకుంది.
ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు.. సొంత బిడ్డనే కిడ్నాప్ చేయించింది ఓ మహిళ… ఈ ఘటన బిహార్‌లోని ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది. తన సొంత కుమారుడిని కిడ్నాప్ చేయించి కిడ్నాపర్లమని చెప్పించి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది మహిళ. కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అనుమానంతో బబితా దేవిని విచారించగా.. తామే కిడ్నాప్ చేశామని విచారణలో అంగీకరించింది. దీంతో బబితా దేవితో పాటుగా ఆమె ప్రియుడు నీతీశ్‌కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల బాలుడి మామ ఆదిత్య కుమార్ తన కిడ్నాప్ గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సరన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) కుమార్ ఆశిష్ తెలిపారు. రూ. 25 లక్షల ఇవ్వకపోతే బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లమని చెప్పి బెదిరించినట్లుగా తెలిపారు.
Also read
- Telangana: దారుణం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
- Durgs : శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!
- Crime News: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేస్తూ.. చివరికి!
- Ranya Rao: కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..! రన్యా రావు సంచలన స్టేట్మెంట్