తిరుపతి రాయలచెరువు రోడ్డు కూడలిలోని అన్నమయ్య విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ తొడగడంపై వివాదం
తిరుపతి (తితిదే): తిరుపతి రాయలచెరువు రోడ్డు కూడలిలోని అన్నమయ్య విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ తొడగడంపై వివాదం నెలకొంది. మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనపై హిందూ సంఘాలు, స్వామీజీలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్య విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి ఆ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. నిందితులను అరెస్టు చేసేవరకు ఉపవాస దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. తిరుపతి తూర్పు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా బిచ్చగాడిలా కనిపిస్తున్న ఓ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. కూడళ్లలో పెన్నులు విక్రయిస్తూ ఉంటాడని, అతడిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సంయమనం పాటించాలని కోరారు. ఇలా చేయడానికి అతడిని ఎవరైనా ప్రోత్సహించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Also Rea’s
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు