SGSTV NEWS
Technology

రోజంతా స్పామ్‌ కాల్స్‌తో విసిగిపోతున్నారా?.. అయితే ఈ యాప్‌ను ట్రై చేయండి!


రోజంతా క్రెడిట్‌ కార్డ్స్‌, లోన్‌యాప్స్‌, స్పామ్‌ వంటి ప్రమోషనల్‌ కాల్స్‌తో విసిగిపోతూ ఉన్నారా..? అయితే మీకే ఈ గుడ్‌న్యూస్. ఈ సమస్యలను చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను యూజ్‌ చేయడం ద్వారా స్పామ్‌, ప్రమోషనల్‌ కాల్స్‌ నుంచి మీరు ఉపసమనం పొందవచ్చు. ఇంతకు ఆ యాప్‌ ఏంటీ, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం పందండి.


ఈ మధ్య మార్కెటింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. కంపెనీలు తమ ప్రాడక్ట్స్‌ గురించి మార్కెటింగ్ చేసుకునేందుకు. జనాలకు తరచూ కాల్స్‌ చేస్తూ ఉంటారు. ఇలా రోజంతా బ్యాంకులు, క్రెడిట్‌ కార్డ్స్‌, లోన్‌ యాప్స్‌, రియల్‌ ఎస్టేట్, ఇతర మార్కెటింగ్‌కు సంబంధించిన స్పామ్‌ కాల్స్ వల్ల జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు? అయితే జనాలను ఈ సమస్య నుంచి బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ మీకు ‘స్పామ్ షీల్డ్’ లాగా పనిచేస్తుంది. దీని కోసం, మీరు ప్లే స్టోర్ నుండి ప్రభుత్వ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి లాగిన్‌ అవ్వాలి. అయితే ఈ యాప్‌ను యూజ్‌ చేసి స్పామ్‌ కాల్స్‌ నుంచి ఎలా ఉపసమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

DND TRAI యాప్ ని ఎలా ఉపయోగించాలి?

👉 nప్రమోషనల్ కాల్స్ నుండి తప్పించుకోవడానికి, మీరు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ‘DND TRAI’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ప్రభుత్వ అందిస్తున్న యాప్ కావడంతో దీన్ని మీరు iOS, Android రెండింటి నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

👉  ఫస్ట్‌ స్టెప్‌ మీ మొబైల్ నంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేయండి.. మీకు వచ్చిన ఓటీపీతో యాప్‌లో లాగిన్‌ అవ్వండి .

👉  లాగిన్ అయిన తర్వాత, మీకు ఒక డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. అందులో నుండి మీరు అనేక పనులు చేయవచ్చు.

👉  ముందుగా, పైన కనిపించే ‘ఛేంజ్ ప్రిఫరెన్స్’ ఆప్షన్‌పై నొక్కండి. ఇక్కడ మీరు ఏ కాల్స్‌ను స్వీకరించాలనుకుంటున్నారో, ఏవి వద్దనుకుంటున్నారో ఎంచుకోండి.

👉  ఇప్పుడు ‘DND కేటగిరీ’లో మీకు అనేక ఎంపికలు లభిస్తాయి. ‘బ్యాంకింగ్/ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్/ఇన్సూరెన్స్/క్రెడిట్ కార్డులు, రియల్ ఎస్టేట్, విద్య వంటి కొన్ని రకాల కాల్‌లను బ్లాక్ చేయడానికి మీరు ‘పూర్తిగా బ్లాక్’ నుండి ఎంచుకోవచ్చు.

👉  దీని తర్వాత, ‘DND కేటగిరీ’లో ఎంచుకున్న ఎంపికకు కాల్స్ లేదా SMS లను మాత్రమే బ్లాక్ చేయాలనుకుంటున్నారా అని మీరు నిర్ణయించుకోవచ్చు.

👉  వారంలోని రోజువారిగా కూడా మీరు ఎప్పుడు కాల్స్ రావాలో, ఎప్పుడు రాకూడదో కూడా సెట్ చేయవచ్చు, అలాగే డే అండ్‌ నైట్‌ టైమ్‌ను కూడా సెట్‌చేసుకోవచ్చు.

మోసపూరిత కాల్స్‌ను ఎలా గుర్తించాలి?

👉  ఈ యాప్‌లో, మీరు స్పామ్ కాల్‌ల గోలా నుంచి తప్పించుకోవడమే కాకుండా, మీకు వచ్చే మోసపూరిత కాల్స్‌,SMSలను కూడా గుర్తించవచ్చు.

👉  దీని కోసం, యాప్‌లో ఇవ్వబడిన ‘ఫ్రాడ్ కాల్/SMS’ ఎంపికకు వెళ్లండి.

👉  మీరు అక్కడ క్లిక్ చేస్తే, మీరు DoT (టెలికమ్యూనికేషన్ల విభాగం) వెబ్‌సైట్‌కు తీసుకెళ్లబడతారు.

👉  అక్కడ అభ్యర్థించిన సమాచారాన్ని ఫిల్‌ చేయడం ద్వారా మీరు మోసపూరిత కాల్ గురించి ఫిర్యాదు చేయవచ్చు.

👉 వాట్సాప్‌లో వచ్చే మోసపూరిత మెసేజ్‌, కాల్స్‌పై కూడా మీరు ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు.

Also read

Related posts

Share this