SGSTV NEWS
శీర్షిక

తన  గర్భం నుండి భూమి  మీదకి తీస్కుకొచ్చి
లోకాన్ని పరిచయం  చేస్తుంది అమ్మ..!

:మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
                  11 th MAY 2025
తన  గర్భం నుండి భూమి  మీదకి తీస్కుకొచ్చి
లోకాన్ని పరిచయం  చేస్తుంది అమ్మ..!

కనులు తెరిచిన క్షణం నుంచి చివరి దుప్పటి కప్పుకొనే వరకు బంధం కోసం కుటుంబం కోసం అందరికి ఆత్మీయత పంచి, అహర్నిశలు కష్టించి, తన ఇంటిని నందనవనం చేస్తుంది అమ్మ..!

నీడలా వెన్నంటే ఉంటూ జ్ఞానాన్ని అందించే
సరస్వతీ దేవిలా పెంచుతుంది  అమ్మ..!

గురువులా లోకం పోకడలు, నవసమాజ
నిర్మా ణానికి అవసరమైన అన్ని అర్హతలు
కలిగి ఉన్న ఒక బాధ్యత గల పౌరురాలుగా,
పౌరుడిగా పెంచుతుంది అమ్మ..!
తొలి అడుగు తానై నడిపిస్తు మంత్రిగా,
మార్గదర్శిగా లోపాల్ని సరిదిద్దుతూ మన జీవితానికి పునాదులు ఏర్పరుస్తు పెంచుతుంది అమ్మ..!

పచ్చని చెట్ల మద్య గంతులు వేసే  జింకపిల్లలా పెంచుతుంది అమ్మ..!

తరతరాల చరిత్రకు సాక్ష్యం అమ్మ,
అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218.

Share this