July 1, 2024
SGSTV NEWS
Andhra Pradesh

మత ప్రాతిపదికన విభజించే పాలకుల్ని తరిమి కొట్టండి….‌ఐ.యఫ్.టి.యు



       138 వ మేడే సందర్భంగా ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో నిడదవోలు యర్నగూడెం రోడ్ లోని ఐ.యఫ్.టి.యు స్థూపం వద్ద ఇఫ్టూ నిడదవోలు ఏరియా ప్రెసిడెంట్ తీపర్తి వీర్రాజు జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలన్నారు.
    అనంతరం పుర వీధుల్లో ఎర్ర జెండా లతో నిర్వహించిన ప్రదర్శన, గణపతి సెంటర్లో నిర్వహించిన జెండా ఆవిష్కరణ లో ఐ.యఫ్.టి.యు జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్య నారాయణ మాట్లాడుతూ దశాబ్దాలుగా దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి, కార్పొరేట్ అనుకూల 4 కోడ్ లు తెచ్చి, కార్మిక యధేచ్ఛ దోపిడీ కి బాటలు వేసిందన్నారు. ఈ నేపథ్యంలో చికాగో అమరుల త్యాగాల స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలన్నారు.
        ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కేంద్రం లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాల రద్దుతో కార్మికుల్ని, నూతన వ్యవసాయ నల్ల చట్టాల తో కార్మికులను, పరిశ్రమ లు, ప్రభుత్వ సంస్థల అమ్మకం ద్వారా ఉద్యోగులను రోడ్ల పాలు చేసిందనీ, ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేకపోయిన మోఢి వేల కోట్ల రూపాయలు పటేల్ విగ్రహానికి, అయోధ్య రామాలయానికి ప్రజల సొమ్ము ఖర్చు చేయడమే కాకుండా, మసీదు లు ధ్వంసం ద్వారా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విద్వేష విధానాలను తిప్పికొట్టి, కార్మిక, శ్రామిక వర్గం మేడే పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
     పై కార్యక్రమంలో శెట్టిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ఖండవల్లి వెంకట్రావు, పాటంశెట్టి రాజేష్, అభ్యుదయ పెయింటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నూతంగి రమేష్, రవ్వ సురేష్ కుమార్, పెండ్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు వాకా సత్యనారాయణ, కార్యదర్శి కారింకి రమేష్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ మల్లిడి రామిరెడ్డి, కోరుపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కట్టా దుర్గా ప్రసాద్, సమిశ్ర గూడెం ఉపాధి హామీ కూలి సంఘం సెక్రటరీ గెడ్డం రవీంద్ర బాబు,కలవచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు మల్లిపూడి రామచంద్ర రావు , నిడదవోలు కార్పెంటరీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొమ్మోజు శేఖర్ తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts

Share via