SGSTV NEWS
Astro TipsAstrology

మకర సంక్రాంతి రోజు నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం



భారతదేశ వ్యాప్తంగా సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ సంతోషమే. దేశంలోనే అతి పెద్ద పండగ సంక్రాంతి. పొలాల్లో పండిన పంట చేతికి అంది ఇంటికి వస్తుంది. కొత్త బియ్యంతో పొంగలి చేస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఆచారాలుంటాయి. అలాగే శక్తివంతమైన గ్రహాలు కూడా కొత్త ఏడాదిలో సంచారం చేయబోతున్నాయి. గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు మకరరాశిలోకి సంచారం చేయడంవల్ల మకర సంక్రాంతి అనే పేరు స్థిరపడింది. 14వ తేదీన మకర రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడి వల్ల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని, కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

మకర రాశి
వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకొని ఆర్థికంగా భారీ లాభాలను అందుకుంటారు. వాటిని జాగ్రత్తగా పొదుపు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. భవిష్యత్తులో మంచి రాబడినిచ్చేలా పొదుపు ఉండాలి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి రెండువైపుల నుంచి అంగీకారం లభిస్తుంది. స్నేహితులతో కలిసి లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ఇద్దరికీ శక్తి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. బాగుంటుంది.




సింహరాశి
మకర సంక్రాంతి నుంచి ఈ రాశివారికి అద్భుతంగా కలిసివస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపు పొందుతారు. పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నవారికి పెళ్లిళ్లు కుదురుతాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు. వ్యాపారులకు బాగా కలిసివస్తుంది. మార్పులు చోటుచేసుకొని కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి అన్నీ సానుకూలంగా జరుగుతాయి. విద్యార్థులకు కలిసివస్తుంది.


కర్కాటక రాశి
ప్రేమ జీవితంలో ఉన్నవారి సమస్యలన్నీ తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడి ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు తమ వ్యాపారాలను విస్తరించాలనే యోచనలో ఉంటారు. అందుకు అనుకూలంగా పరిణామాలు ఏర్పడతాయి. విద్యార్థులకు విద్యకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకనే వారి కోరిక నెరవేరుతుంది.

Related posts

Share this