జ్యోతిష్యం ప్రకారం జూన్ నెల చాలా కీలకమైన నెల. ఈనెల ఐదోతేదీన దేవతల గురువైన బృహస్పతి, రాక్షకుల గురువైన శుక్రుడు కలుసుకుంటున్నారు. వీరిద్దరూ 60 డిగ్రీల కోణంలో ఉండటంవల్ల విశిష్టమైన సంయోగం ఏర్పడుతోంది. దీనివల్ల మూడు రాశులవారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. సంపదకు, విలాసవంతమైన జీవితానికి శుక్రుడు కారకుడైతే, ఆధ్యాత్మికతకు, సంతానానికి, వివాహానికి గురువు కారకుడవుతాడు. వీరిద్దరూ కలిసి ఏయే రాశులకు ఏవిధంగా లాభాలు తెచ్చిపెడుతున్నారో చూద్దాం.
కుంభ రాశి
గురువు, శుక్రుడు కలిసి ఏర్పరుస్తున్న యోగంవల్ల ధనలాభం కలుగుతుంది. దీనివల్ల ఈ రాశివారి సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కొంచెం గట్టిగానే ప్రయత్నించాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు గురువును, శుక్రుడిని పూజించాలి.
ధనుస్సు రాశి
ఒకరకంగా ఈ రాశివారికి బంగారు రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్లాలనుకొని ఎంతోకాలం నుంచి ప్రయత్నిస్తున్నవారి కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు రాబడి రావడం ప్రారంభమవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించి అందులో సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారు. దీనివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు.
తులా రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అనుకున్న సమయంలోనే విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంతోపాటు ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. గతంలోకంటే ఇప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఈ రాశివారు కొంత జాగ్రత్త పాటిస్తే మేలు కలుగుతుంది. లేదంటే వివాదాలు రేకెత్తే అవకాశం ఉంది.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





