March 17, 2025
SGSTV NEWS
NationalTelangana

దారుణం.. హోలీ రోజు ఫుల్గా తాగి కొట్టుకుని చనిపోయిన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్!


బెంగళూరులో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ముగ్గురు కార్మికులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

బెంగళూరులో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ముగ్గురు కార్మికులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కార్మికులు ముందుగా గొడవకు దిగారని, ఆ తర్వాత కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. మరణించిన ముగ్గురు కార్మికులు బీహార్ నివాసితులనేని తేల్చారు. మృతులను అన్సు (22), రాధే శ్యామ్ (23), దీపు(23)గా గుర్తించారు. కార్మికులందరూ ఒకే గ్రామానికి చెందినవారని చెబుతున్నారు…

ఉదయం నుంచి తాగుతూనే
హోలీ పండగ సందర్భంగా ఉదయం నుంచి అంతా మద్యం సేవించారని.. ఈ సమయంలో, ఏదో ఒక విషయంపై వివాదం తలెత్తడంతో గొడవ మొదలైందని.. దీంతో వీరంతా కర్రలు, ఇనుప రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ సంఘటన గురించి  స్థానికులు  నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.  అపార్ట్‌మెంట్ కారిడార్‌లో ఒక మృతదేహం పడి ఉండటాన్ని, గదిలో రక్తంలో తడిసి ఉన్న మరో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు.  మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు.

ఒకరు అరెస్ట్, ఇద్దరు పరారీలో
ఈ హత్య కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బెంగళూరు రూరల్ ఎస్పీ సికె బాబా, అదనపు ఎస్పీ నగేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కోసం డాగ్ స్క్వాడ్‌ను కూడా సంఘటనా స్థలానికి పిలిపించారు. ప్రస్తుతం, పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం వెతుకుతున్నారు.  గొడవ వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో, ఈ కేసు పరస్పర వివాదంగా కనిపిస్తున్నప్పటికీ, పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share via