Thiruvananthapuram: ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తున్నారు. మనస్థాపానికి గురై క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ మహిళ డాక్టర్ కోపాన్ని కంట్రోలో చేసుకోలేక చేసిన పనికి అరెస్ట్ అయ్యింది.
ఇటీవల కొంతమంది చిన్న చిన్న విషయాలకు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల మాటలు వినకుండా క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం కొన్నిసార్లు హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. ఇటీవల వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. తాను ప్రేమించిన ప్రియుడి భార్య అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించిన ఓ మహిళా డాక్టర్ ప్లాన్ రివర్స్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..
Also read :భర్త ముందే దారుణం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు బైక్ పై వెళుతుండగా..
తిరువనంతపురం వంచియూర్‌లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ అధికారి షినిని ఎయిర్ పిస్టల్‌తో కొల్లత్తె ప్రైవేట్ ఆసుపత్రిలోని పల్మనాలజీ గా పనిచేస్తున్న డాక్టర్ దీప్తి మోల్ జోస్ (37) కాల్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. కాల్పుల ఘటన తర్వాత షినీ భర్త సజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సుజీత్, దీప్తి మద్య స్నేహం ఏర్పడిందని.. సుజిత్ తో స్నేహానికి షినీ అడ్డు వస్తుందని భావించిన దీప్తి ఆమె అడ్డు తొలగించుకునేందుకు ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే దీప్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Also read :AP News: గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డిపై వేటు.. ఏసీబీ విచారణకు ఆదేశం
ఈ ఘటనపై డీసీపీ నితిన్‌రాజ్ మాట్లాడుతూ.. వంచియూర్‌లోని కొల్లత్తె ప్రైవేట్ హాస్పిటల్ లో క్రిటికల్ కేయర్ విభాగంలోని పని చేస్తున్న డాక్టర్ దీప్తిమోల్ జోస్నే కొంత కాలంగా షినియెన్ అనే మహిళ భర్త సుజిత్ తో పరిచయం ఏర్పడింది. వీరి సంబంధానికి షినియోన్ అడ్డు వస్తుందని.. ఆమె అడ్డు తొలగించుకోవడానికి పక్కా ప్లాన్ వేసింది. యుట్యూబ్ చూసి పిస్టల్ ని ఎలా వాడాలి అన్న విషయం గురించి తెలుసుకుంది. ఆన్‌లైన్ ద్వారా ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసింది. సుజిత్ ఇల్లు దీప్తికి ముందే తెలుసు. కొరియర్ లేడీగా ముఖానికి ముసుగు వేసుకొని షినియెన్ ఇంటికి చేరుకొని ఆమెపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో షినీ చిన్న ప్రమాదంతో తప్పించుకుంది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాల్పుల తర్వాత దీప్తి కారులో పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కొల్లం వరకు సిసిటివి దృశ్యాలను సేకరించి దీప్తిని కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేశారు
Also read :జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు..!