దీపావళి రోజు అరుదైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా నాలుగు శుభ యోగాలు కావడంతో ఐదు రాశులకు మహర్దశ పట్టుకుంటోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఊహించనిరీతిలో ధనయోగం పట్టుకుంటోంది. జ్యోతిష్యం ప్రకారం ఈ దీపావళి అత్యంత ప్రత్యేకమైంది. సంసప్తక యోగం, నవంపచమి రాజయోగం, లక్ష్మీ యోగం, శశ మహారాజ యోగం ఏర్పడ్డాయి. ఏ రాశులకు ఇవి లక్ష్మీ కటాక్షానికి కారణమయ్యాయో తెలుసుకుందాం
కన్యా రాశి
సంసప్తక రాజయోగంవల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతోంది. వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగులకు, విద్యార్థులకు అందరికీ లాభదాయకంగానే ఉంటుంది. అందరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఊహించనిరీతిలో సంపద వస్తుంది. పెండింగ్ లో ఉన్న డబ్బులు ఈ సమయంలోనే చేతికి అందుతాయి.
కుంభ రాశి
రుణ బాధలు తీరిపోతాయి. ఊహించనిరీతిలో సంపద వస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలుంటాయి. వాటివల్ల కూడా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టవు.
వృషభ రాశి
శశ మహారాజయోగం వీరికి మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. గతం నుంచి ఉన్న వివాదాలు పరిష్కారం కావడంతోపాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి తరుణం. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యంపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మికంగా ధనలాభం కలగడంతో ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు
తులారాశి
ఈ రాశివారికి ఇది మంచి అనువైన సమయం. ఒకరకంగా వీరు పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఊహించనిరీతిలో డబ్బు చేతికి వస్తుంది. వీరికి బంగారు రోజులని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది.
