July 2, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

దొంగతనంలో వీరి రూటే సపరేటు.. వాటిని కూడా వదలని దుండగులు..

డబ్బులు, బంగారం దోచుకెళ్లే దొంగల్ని చూసి ఉంటారు. కానీ చిత్తు కాగితాలు దొంగతనం చేసిన దొంగల్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఆ దొంగలకు దొంగతనం ఎక్కడ చేయాలో తెలియక వచ్చారో.. లేక దొంగతనంలో మెళకువలు, నైపుణ్యం నేర్చుకునేందుకు పుస్తకాలతో జ్ఞానం పెంచుకునేందుకు వచ్చారో తెలియదు. అయితే ఏకంగా గ్రంథాలయంలోనే చోరీకి పాల్పడ్డారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. ఇలాంటి వెరైటీ దొంగతనం తెలుసుకోవాలంటే సత్యసాయి జిల్లాకు వెళ్లాల్సిందే.

Also read :ప్రేమ అంటూ పెడదోవ పడుతున్న అమ్మాయల మధ్య.. ఓ చదువుల తల్లి విషాద గాథ!

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గ్రంథాలయం తాళాలు పగులగొట్టి.. అడ్డొచ్చిన వాచ్ మెన్‎ను బెదిరించి గ్రంథాలయాన్ని దోచుకున్నారు. గ్రంథాలయంలో దోచుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? ఇంకేముంది పాత పుస్తకాలు, చిత్తు కాగితాలతోపాటు.. కుర్చీలు, ఫర్నీచర్, ఫ్యాన్లు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి గ్రంథాలయాన్నే ఎందుకు ఎంచుకున్నారు అన్నది పోలీసులకు అర్థం కావడం లేదు. ఈ వెరైటీ దొంగతనంపై గ్రంథాల ఇన్చార్జి జయరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్తు కాగితాలు దొంగిలించిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలిసిన స్థానికులు వీళ్ళు ఏంటి రా బాబు ఇలా ఉన్నారు అనుకుంటున్నారు

Also read :మరిదితో వివాహేతర సంబంధం!.. చివరకు ఏం జరిగిందంటే?

Related posts

Share via