తాజాగా కర్ణటాక రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల యువతి.. బాత్రూమ్‌లోకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకరం రేపింది. అసలేం జరిగిందంటే..
ఇటీవల కాలంలో చాలామంది యువత చిన్న చిన్న కారణాలను కూడా పెద్దవిగా చూస్తూ.. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతో బంగారు భవిష్యత్తు కలిగిన యువత.. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం వంటి వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా తప్పుడు నిర్ణయాలతో అర్ధంతరంగా తనువు చలించడమే కాకుండా.. కన్నవారికి కడుపుకోతను మిగిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటకలోని ఓ యువతి బాత్రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..
తాజాగా కర్ణటాక రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల యువతి.. బాత్రూమ్‌లోకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకరం రేపింది. అయితే ఈ సంచలన ఘటన బెంగళూరులో కు చోటు చేసుకుంది. అయితే యువతి బాత్రూమ్‌లో చనిపోయి ఉండడాన్ని మొదట ఆమె తమ్ముడు గమనించాడు. మృతిరాలు తమ్ముడు తెలిపిన వివరాల మేరకు.. బాత్రూమ్‌లోకి వెళ్లిన తన అక్క ఎంతకూ బయటికి రాకపోవడంతో ఏం జరిగిందోనని ఏం జరిగిందోనని భయపడిన ఆ యువకుడు.. చివరికి ఆ బాత్రూమ్ తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చుశాడు. కానీ, ఇంతలో అక్కడ ఆ యువకుడికి తన అక్క రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. దీంతో ఈ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా.. వారు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.ఇక సంఘటన స్థలానికి చేరుకున్న బెంగళూరు సౌత్ డీసీపీ ఎస్ లోకేష్ జగల్సార్ ఈ ఘటన బుధవారం రాత్రి 7.30 కు జరిగిందని వెల్లడించారు. అయితే మృతి చెందిన యువతి స్నానం చేస్తానని చెప్పి బాత్రూంలోకి వెళ్లి ఎంతకూ బయటకు రాలేదని.. చివరికి ఆమె సోదరుడు ఆ బాత్రూం తలుపును పగలగొట్టి చూడగా ఆ యువతి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉందని తెలిపారు.
అంతేకాకుండా.. సంఘటన స్థలంలో సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే యువతి మెడ, మణికట్టుపై కత్తితో కోసిన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అయితే అధిక రక్తస్రావం కావడంతోనే యువతి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇకపోతే ఇది హత్యనా లేక ఆత్మహత్య అనేది తెలుసుకునేందుకు అన్ని కోణాలో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే పోలీసులు సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నామని చెప్పడంతో సదురు యువతి తల్లి దానిని ఖండించారు. ఇక తన కుమార్తెను చాలా ప్రేమగా చూసుకునే దాన్ని, పైగా చాలా ధైర్యంగా ఉండేదని, అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత బలహీన మనస్తత్వం కాదని ఆమె తల్లి చెప్పుకొచ్చారు. ఇక సామాజిక కార్యకర్తగా ఎంతో మందిని తాను రక్షించానని.. అలాంటిది తన కుమార్తెకే ఇలా జరిగిందని తెలిపారు. తాను ఎంతో మందిని ప్రశ్నించే క్రమంలో వాళ్లు ఏదైనా కోపంతో తన కూతురును చంపేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
ఇక ఈ ఘటనపై విచారణ జరిపి.. తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే యువతి తల్లి, తమ్ముడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం కోసం యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. రిపోర్ట్ వస్తే తప్ప ఆమెది హత్యనా, ఆత్మహత్యనా అనేది చెప్పలేమని ఆయన తెలిపారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025