• స్నేహితులతో కలిసి హంగామా: కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు
వెంగళరావునగర్: యువతి వైన్స్ షాపు వద్ద హల్చల్ సృష్టించిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు… శుక్రవారం రాత్రి ఓ యువతి తన స్నేహితులతో కలిసి మధురానగర్ లోని మధుర వైన్సు వచ్చింది.
వైన్స్ లోనికి ప్రవేశించి మద్యం బాటిల్స్ పగలకొట్టి, రాక్ లను కొడుతూ, క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి హడావుడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే సరికి యువతి తన హంగామాను కొనసాగిస్తూనే ఉంది. పోలీసులు
యువతితోపాటు ఆమె స్నేహితులను బయటకు తీసుకొచ్చారు.
రోడ్డుపై వచ్చిన వారు ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. ఆయా సంఘటనలను పోలీసులు ఫొటోలు, వీడియోలు తీస్తుండగా వారిని దుర్భాషలాడుతూ వారి ఫోన్ను లాక్కును కింద పడేసి రాయితో పగలకొట్టడానికి ప్రయత్నంచారు. అడ్డుకోబోయిన పోలీసులను రక్కుతూ, జుట్టుపట్టుకుని లాగుతూ కేకలు వేస్తూ ట్రాఫిక్ జామ్ చేశారు. ఎట్టకేలకు వారిని పోలీస్ స్టేషను తరలించారు. అర్ధరాత్రి వరకు పీఎస్లో సిబ్బందిని అత్యంత తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ మరోసారి హడావుడి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు