కొంత మంది బైకర్స్ రేసింగ్లు, స్టంట్లతో నానా రచ్చ చేస్తున్నారు. అర్ధరాత్రి పూట నడి రోడ్లపైనే హంగామా సృష్టిస్తున్నారు. పోలీసులు ప్యాట్రోలింగ్ చేస్తున్నన్ని రోజులు మాత్రమే సైలెంట్గా ఉంటున్నారు. ఆ తరవాత మళ్లీ షరామామూలే. అయితే..కర్ణాటకలోని బైకర్స్ మాత్రం రాత్రుళ్లే కాదు. ఏకంగా పగలే నానా రభస చేస్తున్నారు. రోడ్లపైన వచ్చీ పోయే వాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు చెప్పిన వివరాల ప్రకారం ఇది జిందాల్ సిటీలో జరిగింది. ఓ ఫ్లై ఓవర్పై భారీగా గుమి గూడిన రేసర్లు ఓ స్కూటీని పై నుంచి కిందకు పడేశారు. ఆ తరవాత మరి కొన్ని వాహనాలనూ ఇదే విధంగా ధ్వంసం చేశారు. కింద సర్వీస్ రోడ్లో వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా సేపు ఈ విధ్వంసం కొనసాగింది. అక్కడి వాహనదారులే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోతోందని వాపోతున్నారు స్థానికులు. పోలీసులపై తీవ్ర విమర్శలు రావడం వల్ల వెంటనే అప్రమత్తమయ్యారు. బెంగళూరు పోలీసులు హెబ్బాల్, యలహంక, దేవనహళ్లిలో 33 కేసులు నమోదు చేశారు. వీలింగ్ చేస్తున్న 36 మందిని అరెస్ట్ చేశారు. ఫ్రంట్ వీల్ ముందుకు లేపి ప్రమాదకరంగా బైక్ నడుపుతున్న వాళ్లను గుర్తించారు. ఇందులో మైనర్లు కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పేరెంట్స్ని పిలిచి అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొందరి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం