April 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!


అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు.

ఏపీలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏళ్ల ముసలవ్వకు, ఆటో డ్రైవర్‌కు మధ్య రూ.5 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి చావుకి కారణమైంది. ఆటో డ్రైవర్ రూ.5 ఎక్కువ తీసుకున్నాడని.. ముసలవ్వ నోరు పారేసుకుంది. అది సహించుకోలేని ఆటో డ్రైవర్.. ఏకంగా ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. ఆ వృద్ధురాలిని కొట్టి కొట్టి చంపేసి రోడ్డుపై పడేశాడు. రన్నింగ్ ఆటోలోంచి కింద పడిపోయినట్లు కథ అల్లాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

రూ.5 గొడవకు ప్రాణం బలి
రూరల్ ఎస్సై గాయత్రి ప్రకారం.. రెడ్డెప్ప, గంగులమ్మ (70) దంపతులు. వీరు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, చంద్రాకాలనీలో ఉంటున్నారు. గాజులు, బొమ్మలను జాతరలో అమ్ముతూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం (శుక్రవారం) రాత్రి గంగులమ్మ అక్క లక్ష్మీ దేవి కుమారుడు వెంకటరమణ నీటితొట్టెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు.

దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమని గంగులమ్మ రూ.2 లక్షలు తీసుకుని బయల్దేరింది. ఇందులో భాగంగానే విష్ణు అనే వ్యక్తి షేర్ ఆటో ఎక్కింది. సీఎస్‌ఐ చర్చి వద్ద ఆమె దిగి ఆటో డ్రైవర్‌కు రూ.20 ఇచ్చింది. తిరిగి తనకు రూ.5 వస్తాయని అడిగింది. ఆ ఆటో డ్రైవర్ ఇవ్వకపోవడంతో ముసలవ్వ అతడ్ని తిడుతూ మళ్లీ ఆటో ఎక్కింది. అయితే తనను తిట్టడం అవమానంగా భావించిన ఆ ఆటోడ్రైవర్ బసినికొండ పంచాయతీలోని రామాచార్లపల్లె సమీపంలోకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేశాడు.

ఆపై రోడ్డుపై పడేసి.. రన్నింగ్ ఆటోలోంచి దూకి చనిపోయినట్లు కథ అల్లాడు. ఇక ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆటో డ్రైవర్ విష్ణు విచారించడంతో అసలు నిజం బయటపడింది. అయితే ప్రస్తుతం గంగులమ్మ తీసుకెళ్లిన రూ.2 లక్షలు ఏమయ్యాయి అనే విషయంపై విచారిస్తు్న్నామని ఎస్ ఐ గాయత్రి తెలిపారు.

Also read

Related posts

Share via