SGSTV NEWS online
CrimeNational

దెయ్యం పట్టిందని మద్యం, బీడీ తాగించి, మహిళకు చిత్రహింసలు


కేరళలో దారుణం చోటు చేసుకుంది. 21వ శతాబ్ధంలో శరవేగంగా పరుగులు పెడుతున్న అత్యాధునిక సమాజంలో మూఢనమ్మకాల ఆనవాళ్లు ఇంకా బలంగానే ఉన్నాయి అనడానికి ఊతమిచ్చే ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను దెయ్యం పేరుతో చిత్రహింసలకు గురి చేసిన వైనం దిగ్భ్రాంతి రేపింది.

కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒక యువతికి దెయ్యం పట్టిందంటూ మాంత్రికుడిని తమ ఇంటికి తీసుకొచ్చారు ఆమె అత్తింటి వారు, భర్త, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటూ మంత్రాలు, దెయ్యాలు పేరుతో గంటల తరబడి శారీరక, మానసిక హింసకు గురి చేశాడా మాంత్రికుడు బలవంతంగా మద్యం తాగించి, బీడీ తాగిస్తూ నానా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఆమె మానసిక పరిస్థితి మరింత దిగజారిపోయింది.

దుష్టశక్తి ఆవరించిందంటూ ఉదయం 11.00గంటల నుంచి రాత్రివరకు చిత్ర హింసలు పెట్టారని, చివరికి స్పృహ కోల్పోయానని బాధితురాలు వాపోయింది. బలవంతంగా మద్యం ఇచ్చారని, బలవంతంగా బీడీ తాగించారని, “పవిత్ర బూడిద” తాగించారని, కాల్చడం సహా ఇతర రకాల శారీరక హింసలు పెట్టారని తెలిపింది.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళ భర్త, అత్తింటివారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ప్రధాన నిందితుడైన మంత్రగాడు శివదాస్ (54)ని తిరువల్లలోని ముత్తూర్ ప్రాంతం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే అరెస్ట్ అయినవారిలో మహిళ భర్త అఖిల్ దాస్ (26), తండ్రి దాస్ (54) ఉన్నారు

Also Read

Related posts