వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి తమదైన ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశికి, అలాగే ఒక నక్షత్రం నుండి మరో నక్షత్రానికి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల రాశి మార్పు, నక్షత్ర మార్పు అన్ని రాశులవారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలు నిర్దిష్ట సమయంలో చేసే సంచారం అన్ని విధాలుగా లాభం చేకూరుస్తుంది.
వసంత పంచమి నాడు శని నక్షత్ర సంచారం
ఇక వసంత పంచమి నాడు గ్రహాలలో ముఖ్యంగా భావించే శని నక్షత్ర సంచారం జరుగుతుంది. శని పూర్వభద్ర నక్షత్రం మొదటి పాదం నుండి రెండవ పాదానికి శని దేవుడు సంచరించబోతున్నాడు. ఫిబ్రవరి 2న శని నక్షత్ర సంచారం వసంత పంచమి నాడు జరగనుండడంతో ముఖ్యంగా కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది. ఆయా రాశుల వారు ఈ సమయంలో అన్ని విధాల లబ్ధిని పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మకర రాశి
మకర రాశి వారికి శని నక్షత్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వసంత పంచమి రోజు జరిగే శని సంచారం కారణంగా మకర రాశి వారికి వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మకర రాశి జాతకులు ఈ సమయంలో పిల్లల నుండి శుభవార్తలు వింటారు. డబ్బుకు సంబంధించిన ఒత్తిడి తొలగిపోతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఇది వీరికి అదృష్ట సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలు రాబోతున్నాయి పూర్వభద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఆర్థిక స్థితి బలపడుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో సంబంధం మెరుగ్గా ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి అన్ని విధాలా మంచి సమయం.
మిధున రాశి
శనీ నక్షత్రం సంచారం కారణంగా మిధున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి .ఈ సమయంలో మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే వీలుంటుంది. జీవిత భాగస్వామితో ఇప్పుడు మిధున రాశి వారి బంధం బలంగా ఉంటుంది.ఈ సమయం మిధునరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది.