February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

మసీదు వీధిలో ఘోరం.. క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు పిల్లలకు..

చిత్తురు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తతో గొడవ పెట్టుకొని కరిష్మ క్షణికావేశంలో ఇద్దరు కూతుర్లకు ఉరివేసి.. ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసింది. ఇద్దురు పిల్లలు చనిపోయారు. కరిష్మకు ఆస్పత్రితో చికిత్స అందిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇద్దరు పిల్లలతోపాటు తల్లి ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తురు జిల్లాలో చోటుచేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం సదుంలోని మసీదు వీధిలో షేక్ మన్సూర్, భార్య కరిష్మ (27) కాపురముంటున్నారు. అత్త గౌహర్ జాన్‌తో కరిష్మకు మాటమాట పెరగి గొడవ అయ్యింది. దీంతో శనికావేశంలో కరీశ్మ ఇద్దరు కూతుర్లకు ఉరివేసి.. ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసుకుంది.

ఇంటి మిద్దెపై రూమ్ లో తీసుకెళ్లి ఇద్దరు చిన్నారులను ఉరివేసి ఆమె కూడా ఉరేసుకుంది. వెంటనే అది గమనించిన కుటుంబసభ్యులు ఇంటి తలుపులు పగలగొట్టి తల్లి బిడ్డలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి కరిష్మ గొంతు వద్ద గాయంతో చికిత్స పొందుతుంది.

ఘటనపై సదుం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సిఉంది. కరిష్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు కూతుళ్లు మృతితో తండ్రి మన్సూర్ బాధ చెప్పుకోలేనిది. కుటుంబం, గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.

Also read

Related posts

Share via