March 12, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఇసుక అక్రమ రవాణాకు ఇద్దరు యువకుల బలి

ఇసుక అక్రమ రవాణా ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. రెండు వలస కుటుంబాల్లో చీకట్లు నింపింది. గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపైకి ట్రాక్టరు టైర్లు వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

చర్ల,: ఇసుక అక్రమ రవాణా ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. రెండు వలస కుటుంబాల్లో చీకట్లు నింపింది. గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపైకి ట్రాక్టరు టైర్లు వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొంపెనగూడెంలో చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దర్బ గ్రామానికి చెందిన కుంజం సన్ను(18), శ్యామల సన్ను(19)తో పాటు మరికొందరు గొంపెనగూడెంలో జరుగుతున్న ఓ ఇంటి నిర్మాణ పనుల కోసం వచ్చారు. గురువారం రాత్రి పనులు పూర్తయిన తర్వాత వారంతా అదే ఇంటి ఆవరణలో పడుకున్నారు. ఇంటి నిర్మాణం కోసం గొంపెనగూడెం సమీపంలోని తాలిపేరు నది నుంచి రాత్రిపూట ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్ను డ్రైవర్ రివర్స్ చేశాడు. వెనక నిద్రిస్తున్న ఇద్దరి పైనుంచి ట్రాక్టర్ టైర్లు వెళ్లడంతో కుంజం సన్ను అక్కడే మృత్యువాత పడ్డాడు. శ్యామలకు తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రాణాలతో  బయటపడ్డారు. గాయపడిన శ్యామలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై చర్ల సీఐ రాజువర్మ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ పరారయ్యాడని, ట్రాక్టర్ను స్టేషన్కు తరలించామని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించామన్నారు.

Also Read

Related posts

Share via