June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు..వృద్ధురాలికి తీవ్ర గాయాలు

కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండులో బస్సు బ్రేక్ ఫెయిలై ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లి ఓ వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జయింది.

 

  • జగ్గంపేట, : కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండులో బస్సు బ్రేక్ ఫెయిలై ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లి ఓ వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జయింది. అక్కడి రైలింగ్ను ఢీకొని బస్సు నిలిచిపోవడంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఏలేశ్వరం డిపోకు చెందిన బస్సు ఏలేశ్వరం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే క్రమంలో జగ్గంపేట బస్టాండుకు బుధవారం మధ్యాహ్నం చేరుకుంది. బస్టాండులోకి వచ్చేసరికి బస్సు క్లచ్ చెడిపోయి బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లింది. రైలింగ్ సమీపంలో నిల్చొని ఉన్న సామర్లకోట మండలం గొంచెర్ల గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు మోర్త సుబ్బాయమ్మ కాలిపైకి బస్సు చక్రం ఎక్కడంతో తీవ్ర గాయమైంది. వృద్ధురాలిని జగ్గంపేట ఆసుపత్రికి, అక్కడినుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

Share via