విజయవాడలో ఉంటున్న ఓ వివాహిత మహిళ భర్తకి దూరంగా మూడేళ్ల కూతురితో కలిసి ఉంటుంది. ఆమె శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీనికి కూతురు అడ్డుగా ఉందని ఒంటిపై వాతలు పెడుతూ నరక యాతనకు గురిచేసింది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కుమార్తెకు చిత్రహింసలు పెట్టిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ రాములు అనే వ్యక్తితో విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ వివాహిత మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహిత మహిళ భర్త ఒక ఆటో డ్రైవర్. వ్యక్తిగత కారణాలతో విడిపోయి మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటోంది.
మూడేళ్ల పాప అడ్డుగా ఉందని చిత్రహింసలు చేసి..
ఈ క్రమంలో శ్రీరాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ కలిసి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. కూతురు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటుందని ఇద్దరూ కలిసి పాపను చిత్రహింసలకు గురిచేశారు. ఒంటిపై వాతలు పెడుతూ నరక యాతనకు గురిచేసిన విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి స్థానికుల సాయంతో పాపను తీసుకుని విజయవాడకు వచ్చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గుజరాత్‌లో ఘోరం జరిగింది. సూరత్‌లోని ధర్మశాలలోని జైన సన్యాసి మైన్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు ధర్మశాలకు చెందిన కళాశాలలోని 19ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.
ఈ కేసులో జైన దిగంబర్ శాఖకు చెందిన సన్యాసికి సూరత్‌లోని సెషన్స్ కోర్టు శనివారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో శాంతిసాగర్ జీ మహారాజ్ దోషిగా తేలడంతో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఏకే షా నిందితుడికి రూ.25 వేల రూపాయల జరిమానా కూడా విధించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025