మంత్రి జోగి రమేష్ చెప్పించి గృహ నిర్మాణ శాఖలో సహాయ ఇంజినీరు ఉద్యోగం వేయిస్తానంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.15 లక్షలు స్వాహా చేసిన వైకాపా నాయకుడు మోర్ల కేసు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read 20 రోజుల్లో రూ. 15 లక్షలు సంపాదన.. అలాంటి పని చేస్తూ రైతుల చేతిలో బంధీ
పెనమలూరు, : మంత్రి జోగి రమేష్ తో చెప్పించి గృహ నిర్మాణ శాఖలో సహాయ ఇంజినీరు ఉద్యోగం వేయిస్తానంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.15 లక్షలు స్వాహా చేసిన వైకాపా నాయకుడు మోర్ల మహీధర్ పై కేసు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. ఉప్పాల అనిల్ కుమార్ పెనమలూరు మండలం చోడవరం నివాసి కాగా.. ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. గత ఏడాది జూన్ లో మచిలీపట్నంలో జరిగిన ఓ వైకాపా నేత సంస్మరణ సభకు హాజరయ్యాడు. అక్కడ పోరంకిలో నివసించే వైకాపా నాయకుడు మోర్ల మహీధర్.. అనిల్ కుమార్ కు పరిచయమయ్యాడు. ఇద్దరిదీ ఒకే కులం అంటూ మాటలు కలిపారు. ఎన్నాళ్లు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తావంటూ అంటూ అప్యాయత ఒలకబోశాడు. మంత్రి జోగి రమేష్ తనకు బాగా పరిచయస్థుడని, అతడి ద్వారా ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించానని, నీకు కూడా గృహ నిర్మాణ శాఖలో సహాయ ఇంజినీరు కొలువు వచ్చేలా చేస్తానని భరోసా ఇచ్చాడు. దీనికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలుపగా.. ఆ మాటలు నమ్మిన బాధితుడు అనిల్ కుమార్ క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ రుణాల ద్వారా విడతల వారీగా మహిధర్ ఖాతాకు రూ.15 లక్షలు పంపాడు. మిగతా సొమ్ము కూడా త్వరలో పంపితే ఉద్యోగం చేతిలో ఉంటుందంటూ ఊదరగొట్టాడు. కొన్నాళ్ల తర్వాత నుంచి మహీధర్ ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అనిల్ కుమార్ ఆరా తీయగా అతడు పెద్ద మోసగాడని తెలుసుకున్నాడు. అప్పట్నించి తన సొమ్ము ఇవ్వాలంటూ పలుసార్లు మహీధరన్ ను ఒత్తిడి చేయగా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు. ఇటీవల అనిల్ కుమార్ కు బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో మానసికాందోళనకు గురై నిందితుడిపై మరింత ఒత్తిడి పెచ్చాడు. తన వెనుక మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారంటూ మహీధర్ బెదిరింపులకు దిగాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు అనిల్ కుమార్ గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు మహీధర్ పై మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు