పలువురిని కంటతడి పెట్టించిన దృశ్యం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో హృదయ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన కన్నకొడుకుకు అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెం గ్రామానికి చెందిన కామాని దుర్గాప్రసాద్‌కు తండ్రి మరణించాడు. తల్లి ఆదిలక్ష్మి, భార్య, పిల్లలు ఉన్నారు. దుర్గా ప్రసాద్ ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మంలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అక్కడే జీవనం సాగిస్తున్నాడు. అయితే ఫ్రెండ్ పెళ్లి కోసం దుర్గాప్రసాద్ ఐదురోజుల కిందట నరసాపురం వచ్చాడు. ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్ ఫ్యామిలీకి అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయించాడు. అనంతరం వారి నరసాపురంలో రైలెక్కించాడు. ఆ తర్వాత బంధువులను కలిసేందుకు మోరి బయలుదేరాడు
అయితే మార్గమధ్యలో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారతిప్ప సమీపంలో 216 రహదారిపై దుర్గాప్రసాద్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. వ్యాన్ ఢీ కొనడంతో దుర్గా ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. దుర్గాప్రసాద్ మరణంతో అంతర్వేది పల్లిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దుర్గాప్రసాద్ తల్లి, భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే దుర్గా ప్రసాద్ పిల్లలు చిన్నవాళ్లు కావడం… అతడి తండ్రి కూడా మరణించడంతో తల్లి అంతిమ సంస్కారాలు నిర్వహించింది.
కొడుకుకు తల్లి అంతిమ సంస్కారాలు నిర్వహించడం చూసి పలువురి కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఫొటో కూడా సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇది పలువురి హృదయాలను కదిలించింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025