SGSTV NEWS online
Andhra PradeshCrime

ఏమైందో ఏమో.. చెట్టుపైనే ఊపిరాగింది



గీత కార్మికుడు బాడిదబోయిన రమణ (52) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కారు. ఏమైందో ఏమో కాసేపటికే చెట్టుపై వేలాడుతూ కనిపించారు.



గీత కార్మికుడు బాడిదబోయిన రమణ (52) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కారు. ఏమైందో ఏమో కాసేపటికే చెట్టుపై వేలాడుతూ కనిపించారు. సహచరులు గమనించి చెట్టు ఎక్కి చూడగా అప్పటికే ఆయన ప్రాణాలు వదిలారు. తాడు కట్టి రమణ మృతదేహాన్ని చెట్టు పైనుంచి దింపారు. ఆయన గుండెపోటుతో మృతి చెందారా లేక పాము ఏదైనా కాటేసిందా అన్నది తెలియాల్సి ఉంది. విశాఖ జిల్లా భీమిలి మండలం సింగనబంద పంచాయతీ కృష్ణంరాజుపేటలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Also read




Related posts