July 5, 2024
SGSTV NEWS
Andhra PradeshCrimePolitical

ద్వారంపూడి హల్‌చల్‌

కాకినాడ నగర పరిధిలోని గొడారిగుంటలో అక్రమ కట్టడాన్ని నిలువరించే అధికారులను అడ్డుకుని దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే చం ద్రశేఖర్‌రెడ్డి తీరుపై అధికార పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ద్వారంపూడి హల్‌చల్‌
అక్రమ భవన నిర్మాణం వద్ద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి హల్‌చల్‌

వీడియో…https://x.com/AduriBhanu/status/1808356795070796245?t=oJ9poXorn42-leLiR9WXwA&s=19

అక్రమ నిర్మాణం వద్ద మాజీ ఎమ్మెల్యే వీరంగం

తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ, జనసేన నాయకులు

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై2: కాకినాడ నగర పరిధిలోని గొడారిగుంటలో అక్రమ కట్టడాన్ని నిలువరించే అధికారులను అడ్డుకుని దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే చం ద్రశేఖర్‌రెడ్డి తీరుపై అధికార పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వైసీపీ కార్యకర్త, ద్వారంపూడి అనుచరుడు ఒకరు మొదటి ఫ్లోర్‌ వరకు కార్పొరేషన్‌ నుంచి అనుమతి తీసుకుని రెండో ఫ్లోర్‌ కూడా నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీచేసి చివరకు వాటిని తొలగించే పని మంగళవారం చేపట్టారు. అక్కడకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఆయన అనుచరులు కొద్దిసేపు వీరంగం చేశారు. పోలీసులపై సైతం విరుచుకుపడ్డారు. తొలగింపు పనికొచ్చిన కూలీలపై దాడిచేసి గాయపరిచారు. దీనిపై టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వజమెత్తారు. పదవి కోల్పోయిన చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా అక్ర మ దందాలు కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.

ముందుంది ముసళ్ల పండుగ

ఎదురొస్తే బెదిరించడం, ఖాళీగా కనిపిస్తే ఆక్రమించడం, అక్రమార్కులకు అండగా అండగా నిలబడడం.. గడచిన అయిదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు సాగించిన దందాలను ఎవరూ మర్చిపోలేదు. ఇలాంటి వ్యవహారాల్లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆరితేరినట్టు ఎన్నో ఉదాహరణలు ఉండేవి. ద్వారంపూడి అక్రమాలకు ప్రజలు తమ ఓట్లతో చెక్‌ పెట్టారు. అయినప్పటికీ తానొక మాజీ ఎమ్మెల్యేను అనేమాట మరచి అధికార దందా సాగించాలని మంగళవారం ప్రయత్నించి భంగపడ్డారు. అటు అధికారులు, ఇటు పోలీసులు హెచ్చరిక ధోరణిలో సమాధానం ఇవ్వడంతో అక్కడ నుం చి నిష్క్రమించారు. ద్వారంపూడి నేతృత్వంలో చేసిన బియ్యం కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చే పనిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇటీవలే ద్వారంపూడి దందాలను బయటపెట్టే పని మొదలుపెట్టామని చెప్పి వెళ్లారు. ఆమేరకు అక్రమ బియ్యం నిల్వలపై దాడులు మొదలయ్యాయి. మరోవైపు నగరంలో చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు ఎన్నో భూదందాలకు పాల్పడ్డారు. అవన్నీ ఒక్కొక్కటిగా వెలు గులోకి వస్తున్నాయి. అలాగే అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అలాంటి అక్రమ నిర్మాణం ఒకటి గొడారిగుంటలో చేపడితే, దాన్ని నిలువరించే ప్రయత్నంలో ఉన్న అధికారులపై చంద్రశేఖర్‌రెడ్డి నేరుగా వెళ్లి బెదిరించి దాడికి పాల్పడ్డారు. దీంతో ఉన్నతాధికారులు రం గప్రవేశం చేసి అది అక్రమ కట్టడమేనని తేల్చిచెప్పడంతోపాటు దాడి విషయం పెద్దది కావడంతో చంద్రశేఖర్‌రెడ్డి మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. నిజానికి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చంద్రశేఖర్‌రెడ్డి హయాంలో గడిచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా జరిగా యి. దీనిపై ప్రస్తుత అధికార పక్షం ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే అనేక అవినీతి, అక్రమాలు బయటకి వస్తున్నాయి. గతంలో చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టులపై కూడా దాడులు చేస్తానని నేరుగా హెచ్చరికలు జారీచేశారు. అదేవిధంగా తన అక్రమ దందాలకు అడ్డొచ్చిన ప్రతీ ఒక్కరినీ బెదిరింపులతో పక్కకు తప్పించారు. అధికారులను మభ్యపెట్టి అవసరమైతే బెదిరించి అక్రమదందాలకు అడ్డు లేకుండా ముందుకు సాగారు. దీంతోపాటు చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులు ఆగడాలకు అడ్డేలేకుండాపోయింది. అయిదేళ్లపాటు వారంతా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. గతంలో పవన్‌కల్యాణ్‌ను తిట్టడం, వీరమహిళలపై దాడులు చేయించడంతో పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్‌ ఉండడంతో చంద్రశేఖర్‌రెడ్డి అరాచకాలు బయటపడుతున్నాయి. యంత్రాంగమంతా ద్వారంపూడి అక్రమ దందాలను బయటకులాగే పనిలో ఉండడంతో ముందుంది ముసళ్ల పండగలా కనిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్యే అక్రమాలకు అడ్డులేకుండాపోయింది

మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్ర మాలకు అడ్డులేకుండా పోయిందని టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి అక్రమాలు ఇప్పుడు బయటపడుతున్నాయన్నారు. గొడారిగుంటలో బయటపడిన అక్ర మ కట్టడం ఒక మచ్చుతునక మాత్రమేనని తెలిపారు. ఇలాంటివి ఎన్నో అక్రమాలకు చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులు కాకినాడ నగరంలో పాల్పడ్డారని ఆరో పించారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేకుండా చంద్రశేఖర్‌రెడ్డి అనుచరగణం చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని వివరించారు. గుడారిగుంటలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులను ఆయన అభినందించారు.

– మల్లిపూడి వీరు, టీడీపీ నగర అధ్యక్షుడు

మరిన్ని అక్రమ కట్టడాలు బయటకొస్తాయి..

కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా అధికారంలో ఉన్నానని అనుకుంటున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్‌ ఎద్దేవా చేశారు. గొడారిగుంటలో చంద్రశేఖర్‌రెడ్డి చేసి న అక్రమాలను బయటకు తీస్తున్న అధికారులపై దాడికి పాల్పడడం ఆయన దాష్టీకాలకు ఒక నిదర్శనమన్నారు. చంద్రశేఖర్‌రెడ్డిని ప్రజలు తిరస్కరించారన్న విషయం మరిచిపోయి తన అక్రమాలను కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. మరిన్ని అక్రమ కట్టడాలు వివరాలు బయటపడతాయని తెలిపారు.

– సంగిశెట్టి అశోక్‌, జనసేన రాష్ట్ర కార్యదర్శి

నిబంధనలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు

మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి నిబంధనలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని బీజేపీ నాయకుడు గట్టి సత్యనారాయణ విమ ర్శించారు. ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందిస్తుందని, దానికి అనుగుణంగా అధికారులు నడుచుకుంటారని వివరించారు. చట్టాలన్నీ ప్రజలకు మేలు చేసేవిధంగా ఉంటాయన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి అక్రమ కట్టడాలను ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా చంద్రశేఖర్‌రెడ్డి చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నేతగా ఉందని హితవు పలికారు.

– గట్టి సత్యనారాయణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌

Also read :Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?

Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?

ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!

అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!

Related posts

Share via