SGSTV NEWS online
Andhra PradeshCrime

భార్య, బావమరిది, మామను కత్తితో నరికిన భర్త
ముగ్గురి పరిస్థితి విషమం





పశ్చిమ గోదావరి జిల్లా: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త  భార్యను, అడ్డు వచ్చిన మామ, బావమరిదిని నరికిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. పాలకోడేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లలకోడేరు శివారు తుమ్మలగుంట పాలెంకు చెందిన కడలి సత్యనారాయణ తన కూతురు శ్రీలక్ష్మిని 17 ఏళ్ల క్రితం అత్తిలి మండలం మంచిలికి చెందిన వీరవల్లి రామచంద్రరావు అలియాస్ చందుకు ఇచ్చి పెళ్లి చేశారు. చందు తరచూ ఖతర్ వెళ్ళి వస్తుంటాడు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండు సార్లు పంచాయతీ పెట్టి పరిష్కారం చేసుకున్నారు.

మూడేళ్ల నుంచి తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. కూతురు మహేశ్వరికి కత్తి చూపి మీ అమ్మను చంపేస్తాను అని బెదిరించేవాడు. ఆ విషయం తాత సత్యనారాయణకు చెప్పింది. భయపడ్డ అతను శీలక్ష్మని తన ఇంటికి తీసుకొచ్చాడు. పాలకోడేరు, అత్తిలి పోలీసులు చందుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నెల 9న రాత్రి చందు కత్తితో వచ్చి బయట ఉన్న శ్రీలక్ష్మీ భుజంపై నరికాడు. అడ్డు వచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ ను కూడా నరికాడు. చుట్టుపక్కల వారు వచ్చి ముగ్గురిని భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై రవివర్మ తెలిపారు. మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read

Related posts