SGSTV NEWS online
Andhra PradeshCrime

ఈత సరదా ప్రాణం తీసింది



వైఎస్సార్: లింగాల మండలం  తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా… ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.

నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also read

Related posts