ఒంగోలు::
ఒంగోలు గాంధీ రోడ్డు లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఆలయ తది ఆరాధన సంఘం ఆధ్వర్యంలో 7వ తేదీ ఆదివారం ఆషాడ మాసం శుద్ధ విదియ తిధి రోజున సాయంత్రం 7గం. లకు ఆలయంలో గణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్ముల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి ప్రార్ధన తదుపరి విష్ణు సహస్రనామస్తోత్రం హనుమాన్ చాలీసా భగవద్గీత ముకుంద మాల గోవింద నామాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామ పారాయణము భక్తి పూర్వకంగా పఠించారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యులు స్వామివారి విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ తదియారాధన సంఘం సభ్యులు మాట్లాడుతూ… జూలై నెల 17వ తేదీ బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు గాంధీ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో 7వ తేదీ ఆదివారం నుండి 16వ తేదీ మంగళవారం వరకు పది రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.